logo

అంగన్‌వాడీ టీచర్‌ దుర్మరణం

రహదారిపై గేదె కళేబరాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని మేడిపల్లి గ్రామశివారులో చోటుచేసుకుంది.

Published : 28 Mar 2023 05:06 IST

గేదె కళేబరాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం
కుమారుడికి గాయాలు

వసుంధర

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: రహదారిపై గేదె కళేబరాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని మేడిపల్లి గ్రామశివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన కొడిమ్యాల వసుంధర(49) అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం దిల్లీలో 28న జరగనున్న నిరసన కార్యక్రమానికి సోమవారం వేకువజామున తన పెద్ద కుమారుడు తేజతో కలిసి ద్విచక్ర వాహనంపై మెట్‌పల్లికి బయలుదేరారు. మేడిపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై మృతిచెందిన గేదె కళేబరం చీకట్లో గమనించక దాన్ని ఢీకొని అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై ఘటన స్థలంలోనే వసుంధర మృతి చెందగా తేజకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని