logo

ప్రజావాణికి కత్తితో వచ్చిన మహిళ

 జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణికి ఓ మహిళ కత్తితో వచ్చింది. గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన అరుణ జగిత్యాల ఠాకా వీధిలో నివాసముంటుంది.

Published : 28 Mar 2023 05:06 IST

మహిళను అడ్డుకున్న పోలీసులు

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణికి ఓ మహిళ కత్తితో వచ్చింది. గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన అరుణ జగిత్యాల ఠాకా వీధిలో నివాసముంటుంది. ఉదయం ప్రజావాణికి రాగా మహిళా పోలీసులు ఆమె బ్యాగును పరిశీలించగా కత్తి కనిపించింది. దీంతో మహిళను ఆరుబయట నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మహిళను వెంటబెట్టుకుని అదనపు కలెక్టర్‌ వద్దకు తీసుకురాగా తాను సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పి పంపించారు. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేనట్లు గుర్తించిన మహిళా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని