logo

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా సోమవారం ఆర్డీవో కార్యాలయ ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

Published : 28 Mar 2023 05:25 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

తహసీల్‌ చౌరస్తా వద్ద దీక్షలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా సోమవారం ఆర్డీవో కార్యాలయ ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భారత్‌ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ పార్టీపై భాజపా కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని భాజపా కుట్ర పన్నిందని రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారవేత్తలకు రూ.లక్షల కోట్లు మాఫీ చేశారని వివరించారు. భాజపా ప్రజావ్యతిరేక విధానాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంగా పనిచేయాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని జీవన్‌రెడ్డి అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బీన్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పీసీసీ సభ్యుడు గిరినాగభూషణం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బండ శంకర్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌, మైనార్టీ, ఎస్సీ విభాగాల అధ్యక్షులు టి.విజయలక్ష్మి, మన్సూర్‌, ధర రమేష్‌బాబు, నందయ్య, మోహన్‌, రాజేందర్‌, పురపాలక ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, క్రిష్ణారావు, సుజిత్‌రావు, యువజన జిల్లా, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని