logo

కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన దీక్ష

రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు చౌరస్తాలో  నిరసన దీక్ష నిర్వహించారు.

Published : 28 Mar 2023 05:21 IST

దీక్షలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు చౌరస్తాలో  నిరసన దీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ప్రారంభించి మాట్లాడుతూ.. దేశాన్ని అప్పుల్లో ముంచి ఇతర దేశాలకు పారిపోయిన వారంతా మోదీలే అని విమర్శించారు. నేర నిరూపణ అయిన భాజపా నాయకులకు జైలు శిక్ష ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. రాజకీయ కుట్రతోనే పార్లమెంట్‌ నుంచి బహిష్కరించారని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ వేసిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడిపల్లి సత్యం, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పద్మాకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వైద్యుల అంజన్‌కుమార్‌, మడుపు మోహన్‌, అనుబంధ సంఘాల అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, పులి అంజనేయులుగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని