బల్దియాలో ట్రేడ్ లైసెన్సుల దందా..
‘ఆస్తిపన్ను వసూలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఓ వైపు కలెక్టర్ యాస్మిన్‌బాషా పురపాలక సిబ్బందిని ఆదేశించింది.
వ్యాపారులతో సిబ్బంది కుమ్మక్కు
న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం
‘ఆస్తిపన్ను వసూలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఓ వైపు కలెక్టర్ యాస్మిన్‌బాషా పురపాలక సిబ్బందిని ఆదేశించింది. ఈ మేరకు అన్ని విధాలా చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు. పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓవైపు సూచనలు జారీ చేస్తుంటే ఇంటి దొంగలే ట్రేడ్ లైసెన్సుల జారీని వ్యాపారంగా మలుచుకుంటున్నారు.’
వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన లైసెన్సుల జారీలోనూ బల్దియాలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పట్టణంలో ఎలాంటి వ్యాపారం, వాణిజ్య అవసరాలకైనా బల్దియా ట్రేడ్ లైసెన్సు విధిగా పొందాలి. ఇందుకోసం మీసేవ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారుల వ్యాపారాన్ని చదరపు అడుగుల మేరకు లెక్కించి రుసుము నిర్ణయిస్తారు. ఈ మేరకు విధిగా ట్రేడ్ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్లలో జారీ చేసిన ట్రేడ్ లైసెన్సుల్లో అత్యధిక శాతం అక్రమాలు చోటుచేసుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 167 ట్రేడ్ లైసెన్సులు, 2022-23లో 250 లైసెన్సులను పురపాలక సంఘం జారీ చేసింది. వీటి ద్వారా 2021-22లో రూ.4.31 లక్షలు, 2022-23లో రూ.6.83 లక్షల ఆదాయం బల్దియాకు సమకూరింది. వాస్తవంగా లెక్కిస్తే ట్రేడ్ లైసెన్సుల రూపంలో మరో మూడు వంతుల ఆదాయం బల్దియా కోల్పోయిందని స్పష్టమవుతోంది.
అక్రమాలివీ..
ట్రేడ్ లైసెన్సుల జారీలో 80 శాతం అక్రమాలే కొనసాగుతున్నాయి. మీ సేవతో సంబంధం లేకుండా నేరుగా బల్దియా కార్యాలయంలో సిబ్బందిని కలిసి తమ వ్యాపారానికి సంబంధించి తప్పుడు సమచారంతో లైసెన్సు పొందుతున్నారు.బల్దియా సూచించిన నిర్ణీత ధరలు కాకుండా ఇష్టారాజ్యంగా నమోదు చేసి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. మూడు, నాలుగు అంతస్థుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఒకే అంతస్థుగా చూపి అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇందుకోసం వ్యాపారులు, సిబ్బంది ఏకమై రూ.వేలల్లో రుసుము ఎగనామం పెడుతున్నారు. స్థానిక మోచిబజార్‌లో పేరొందిన వస్త్ర దుకాణంలో 5 అంతస్థులకుగాను ఒకే అంతస్థులో 1364 చదరపు అడుగులను చూపి కేవలం రూ.21,250 ట్రేడ్ లైసెన్సు చెల్లిస్తున్నారు. బైపాస్‌రోడ్డులో ఓ బహుళ అంతస్థులో ఉన్న సూపర్‌మార్కెట్ భవనానికి కేవలం ఒకే అంతస్థు అందులోనూ సింగిల్‌రోడ్డు చూపి రూ.24,960 మాత్రమే రుసుము చెల్లిస్తున్నారు. ఇక జాతీయ రహదారిలోని ఓ బార్ రెండంతస్థులు నిర్వహిస్తూ ఒకే అంతస్థుగా చూపి కేవలం రూ.7 వేలు చెల్లిస్తున్నారు. ఇలా పట్టణంలో వందకుపైగా వ్యాపార సంస్థలు బల్దియా ఆదాయానికి కుచ్చుటోపీ వేస్తున్నాయి. ఇందుకు ఏకంగా బల్దియా సిబ్బందే సహకరించడం గమనార్హం. ఉన్నతాధికారులు విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
నిబంధనలివీ..
పట్టణంలో ఎలాంటి వ్యాపార, వాణిజ్య అవసరాలకైనా పురపాలక ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి. పురపాలక చట్టం-2019 ప్రకారం ఆయా వ్యాపార సంస్థలున్నచోట రహదారి వెడల్పు, వాణిజ్య కొలతల ప్రకారం ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ మేరకు జగిత్యాల పురపాలక సంఘం 31.01.2021లో ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. సింగిల్‌రోడ్డులో చదరపు అడుగుకు రూ.5, డబుల్‌రోడ్డుకు రూ.6, మల్టీలేన్‌కు రూ.8, బహుళ అంతస్థులకు రూ.10 చొప్పున ధరను తీర్మానం నంబరు 263 ద్వారా నిర్ణయించారు. ఏ వ్యాపారస్థుడైనా తన వ్యాపారానికి సంబంధించి ట్రేడ్ లైసెన్సు పొందాలంటే మీసేవ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ మేరకు పురపాలక పారిశుద్ధ్య విభాగం సిబ్బంది సంబంధిత ప్రదేశానికి వచ్చి వ్యాపారం నిర్వహించే ప్రదేశాన్ని చదరపు అడుగులో లెక్కించి ధర నిర్ణయిస్తారు. ఈ మేరకు రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్సు పొందాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Health News
Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?
-
India News
Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ..?