logo

కరీంనగర్‌లో స్వచ్ఛత మాషాల్‌ మార్చ్‌

కరీంనగర్‌ నగరాన్ని చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపునిచ్చారు.

Updated : 30 Mar 2023 06:51 IST

పాల్గొన్న విద్యార్థులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరాన్ని చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం ‘స్వచ్ఛత ఉత్సవ్‌- 2023’లో భాగంగా కరీంనగర్‌లో స్వచ్ఛత మాషాల్‌ మార్చ్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాల మైదానం జాతీయజెండా గద్దె దగ్గర మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి నుంచే మూడు విభాగాలుగా చెత్తను వేరు చేసి నగరపాలకకు అందించాలని మేయర్‌ కోరారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకూడదని, నగరానికి స్వచ్ఛతలో జాతీయ స్థాయి ర్యాంకు వచ్చేలా సమష్టిగా కృషి చేయాలన్నారు. కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, కార్పొరేటర్లు వాల రమణారావు, ఐలేందర్‌యాదవ్‌, బుచ్చిరెడ్డి, మాధవి, జయశ్రీ, కల్యాణి, డిప్యూటీ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌, సహాయ కమిషనర్‌ రాజేశ్వర్‌, ఎస్‌ఈ నాగ మల్లేశ్వరరావు, పర్యావరణ ఇంజినీరు స్వామి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత, సీవోలు, ఆర్పీలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
* స్వచ్ఛత మాషాల్‌ మార్చ్‌లో భాగంగా అన్ని డివిజన్‌లలో ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. 37వ డివిజన్‌ రాంనగర్‌లో నగరపాలక డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, 35వ డివిజన్‌ శ్రీనగర్‌కాలనీలో కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డి, 59లో కార్పొరేటర్‌ గందె మాధవి, 39లో కార్పొరేటర్‌ కొండపల్లి సరిత తదితరులు పాల్గొని కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని