logo

సౌకర్యాలపై శీతకన్ను

జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. వీరి ద్వారా ఆర్టీఏకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది.

Updated : 30 Mar 2023 06:45 IST

రవాణా శాఖ కార్యాలయంలో సమస్యలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం

జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. వీరి ద్వారా ఆర్టీఏకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. అలాంటి చోట సరైన సౌకర్యాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత సమస్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

చెట్ల నీడే ఆధారం..

ఇక్కడకు వచ్చే వాహనదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. గదులు లేక చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి  ఏర్పడింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు. ఆ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వాహనదారులు అంటున్నారు. దాహం వేస్తే కార్యాలయంలోకిగానీ రోడ్డుమీదకు గానీ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండే ఎంవీఐ, ఏఎంవీఐ, ఇతర సిబ్బంది కూడా చెట్ల కింది నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన శీతల జలయంత్రం కూడా నిరుపయోగం ఉంటుంది.

వాహనదారుల ఇబ్బందులు

కార్యాలయం ఆవరణలో మూత్రశాలలు లేక అక్కడికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి చెప్పనవసరంలేదు. చోదక పరీక్ష కోసం సిద్ధం చేసిన ట్రాక్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి ట్రాక్‌ పైనే తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరీక్షించడం ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

శాశ్వతంగా ఏర్పాటు చేసే ట్రాకు సంబంధించి కొంతవరకు నిధులు అవసరమవుతాయి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కార్యాలయ ఆవరణలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. శౌచాలయాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
అశోక్‌, ఏవో, రవాణాశాఖ కార్యాలయం, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని