logo

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ఇంట్లో విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చే పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తగిలి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన చందుర్తి మండలం ఎన్గల్‌లో బుధవారం చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 06:39 IST

రుద్రంగి, న్యూస్‌టుడే: ఇంట్లో విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చే పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తగిలి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన చందుర్తి మండలం ఎన్గల్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్గల్‌కు చెందిన పసుల రవి (28) ఇంట్లో విద్యుత్తు కనెక్షన్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు స్వామి, వెంకటమ్మ రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచి లింగంపల్లి సత్తయ్య పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు.


కానిస్టేబుల్‌పై కేసు

కరీంనగర్‌ నేరవార్తలు: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు అయింది. కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ నటేష్‌ వివరాల ప్రకారం.. నగరంలోని బస్టాండ్‌ వద్ద ఎస్సై స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 28న వాహన తనిఖీ చేపట్టారు. ఆ క్రమంలో కమిషనరేట్లోని ఏఆర్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న షబ్బీర్‌.. ఎస్సై, ఇతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తించగా ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని