logo

పొగాకు వినియోగంతో క్యాన్సర్‌

పొగాకు వినియోగించడంతో నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు పొగాకు దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి పిలుపునిచ్చారు.

Published : 01 Jun 2023 05:37 IST

ర్యాలీలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, సిబ్బంది

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పొగాకు వినియోగించడంతో నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు పొగాకు దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి పిలుపునిచ్చారు. బుధవారం పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా నర్సింగ్‌ విద్యార్థులతో కలిసి కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. విద్యాసంస్థలు ఉన్న చోట వంద మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్యాధికారులు సుజాత, సాజిదా, వినీత, రంగారెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంను పురస్కరించుకొని బుధవారం కరీంనగర్‌లో ఆర్టీసీ జోనల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్‌ వైద్యాధికారి డాక్టర్‌ మంజుల, డాక్టర్‌ రచనాసింగ్‌ మాట్లాడుతూ.. ధూమపానం క్యాన్సర్లకు కారణమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది యుగంధర్‌, రమణారెడ్డి, విజయ, శ్యామల, ఎండీ.రయీస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని