logo

ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే నెలలో 140 కాన్పులు

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే నెలలో 140 కాన్పులు విజయవంతంగా నిర్వహించి వైద్యులు రికార్డు సృష్టించారు. ఆసుపత్రి ప్రారంభమైన తరవాత గతంలో ఓసారి వంద వరకు కాన్పులు జరిగాయి.

Published : 01 Jun 2023 05:37 IST

వేములవాడ ఆసుపత్రిలో కేకు కోస్తున్న వైద్యులు

వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే నెలలో 140 కాన్పులు విజయవంతంగా నిర్వహించి వైద్యులు రికార్డు సృష్టించారు. ఆసుపత్రి ప్రారంభమైన తరవాత గతంలో ఓసారి వంద వరకు కాన్పులు జరిగాయి. మేలో అత్యధికంగా ప్రసవాలు చేయడంతో బుధవారం ఆసుపత్రి వైద్యులు కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌రావు వైద్యులను అభినందించారు. అందరి సమష్టి కృషితోనే ఇన్ని ప్రసవాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు చైతన్యసుధ, తిరుపతి, సంతోష్‌చారి, అనిల్‌ కుమార్‌, దీప్తి, వెంకటభరణి, రత్నమాల, జ్యోతి, నవీన్‌, అలేఖ్య, ప్రణతిరెడ్డి, పరమేశ్వరి, బిందు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభినందన

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో మేలో 140 డెలివరీలు చేయడం పట్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆర్‌.మహేష్‌రావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని