logo

అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

మండల పరిధిలోని మల్‌చెరువు తండాలో మాలోతు ఆంజనేయులు (16) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆంజనేయులు..

Updated : 01 Jun 2023 11:59 IST

హుస్నాబాద్‌ గ్రామీణం: అక్కన్నపేట మండలం మల్చేర తండా గ్రామ పరిధిలోని నర్సింగ్‌ తండాకు చెందిన మాలోతు ఆంజనేయులు (16) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్‌ తండాకు చెందిన మాలోతు రాజు, లలిత దంపతుల కుమారుడు ఆంజనేయులు. ఈ బాలుడికి పూర్తిగా మాటలు రావు. బుధవారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బాలుడి కోసం తండాతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. గురువారం తెల్లవారేసరికి గౌరవెళ్లి ప్రాజెక్టు కట్ట సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో హత్య చేసి చెట్టుకు వేలాడదీశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని