logo

లక్ష్యాన్ని అధిగమిస్తూ యూరియా ఉత్పత్తి

ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.) ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తోంది. అనేక అవాంతరాలతో గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోగా

Published : 02 Jun 2023 05:46 IST

రామగుండం ఎరువుల కర్మాగారం

ఫెర్టిలైజర్‌ సిటీ, న్యూస్‌టుడే: ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.) ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తోంది. అనేక అవాంతరాలతో గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోగా ఈ సారి ఇదే తరహాలో ఉత్పత్తి కొనసాగిస్తే లక్ష్యాన్ని అధిగమించే అవకాశముంది. రామగుండం ఎరువుల కర్మాగారం నెలసరి లక్ష్యం 1,07,800 మెట్రిక్‌ టన్నులు కాగా మే నెలలో 1,17,561 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో 109 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఏప్రిల్‌ నెలలో 1,18,805 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో 110 శాతం లక్ష్యానికి చేరుకుంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మే నెలలో ఉత్పత్తి చేసిన యూరియాలో 44,701 మెట్రిక్‌ టన్నులు తెలంగాణకు, 7,975 ఆంధప్రదేశ్‌కు, 22,408 కర్నాటక, 20.194 మహారాష్ట్ర, 16,641 ఛత్తీస్‌గఢ్‌కు, 5,640 మెట్రిక్‌ టన్నులు తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని