logo

పరిహారం ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదం

వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడిస్తారని రామడుగు మండల కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో వాదనకు దిగారు.

Published : 02 Jun 2023 05:46 IST

ఎమ్మెల్యేతో వాదనకు దిగిన నాయకులు

రామడుగు, న్యూస్‌టుడే: వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడిస్తారని రామడుగు మండల కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో వాదనకు దిగారు. గురువారం రామడుగు రైతు వేదికలో సమావేశం నిర్వహించాల్సి ఉండగా పరిహారం కోసం నాయకులు రైతుల సమస్యలను ప్రస్తావించారు. మార్చి నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా నష్టపరిహారం ప్రకటించినా ఫలితం లేకపోయిందన్నారు. కొంత సేపు భారాస నాయకులు ఎదురుదాడికి దిగారు. చివరకు సభ నిర్వహించకుండా అర్ధాంతరంగా ముగించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మరో ఇరవై రోజుల్లో నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటానన్నారు. సాంకేతిక కారణాలతో పరిహారం చెల్లింపులో జాప్యం చోటు చేసుకుందన్నారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి, నాయకుడు పంజాల శ్రీనివాస్‌గౌడ్‌, భాజపా నాయకులు పూరెల్ల శ్రీకాంత్‌గౌడ్‌,  రవీందర్‌ తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత

గంగాధర : గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి అనారోగ్యంతో బాధ పడుతుండడంతో ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గురువారం ముందస్తుగా సీఎం సహాయ నిధి కింద రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

రైతు వేదికలు దేశంలోనే ప్రత్యేకం

రామడుగు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ఏర్పాటు చేసిన రైతు వేదికలు దేశంలోనే ప్రత్యేకమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. గురువారం వెలిచాల, రుద్రారం, రామడుగు రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం రామడుగులో ఆరోగ్య ఉపకేంద్రం, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సింగిల్‌విండో ఛైర్మన్‌ వీర్ల వెంకటేశ్వర్‌రావు, వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ మామిడి తిరుపతి, మండల భారాస అధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు వీర్ల సంజీవరావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ శుకురొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని