logo

కాళేశ్వరంతో తీరిన నీటి గోస

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు, మోహన్‌రావుపేట, సంగెం, అయిలాపూర్‌ గ్రామాల్లోని రైతు వేదికల్లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు.

Published : 04 Jun 2023 05:03 IST

సారంగాపూర్‌లో స్టాల్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

కోరుట్లగ్రామీణం: సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు, మోహన్‌రావుపేట, సంగెం, అయిలాపూర్‌ గ్రామాల్లోని రైతు వేదికల్లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. అయా గ్రామాల్లో ఎండ్లబండి, ట్రాక్టరు, ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. పైడిమడుగు గ్రామంలో ఎడ్లబండిపై ఎమ్మెల్యే, అదనపు కలెక్టరు మకరందు ర్యాలీగా వచ్చారు. పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు స్టాల్స్‌ నిర్వహించగా వాటిని సందర్శించారు. ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి అయాజ్‌, రైసస జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, డీన్‌ డా.మాధవరావు, జడ్పీటీసీ లావణ, ఎంపీపీ తోట నారాయణ, ఏవో నాగమణి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్‌ మకరందు పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

దేశానికే ఆదర్శం

జగిత్యాల ధరూర్‌క్యాంపు: రైతులు, సాగురంగ అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జగిత్యాల మండలం అంబారిపేటలో రైతుదినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఎడ్లబండి, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ తీసారు. ఆర్డీవో దుర్గామాధురి, ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు మహేశ్‌, ఎంపీపీ లక్ష్మి, సర్పంచి గంగాధర్‌, జితేందర్‌రావు, దామోదర్‌రావు, ఏవో వినీల, తదితరులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టుకు నీరు..

సారంగాపూర్‌: గత పాలకుల నిర్లక్ష్యంతో బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించి రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారని ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం సారంగాపూర్‌ రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయిల్‌పామ్‌, నానో ఎరువుల దుకాణాల స్టాల్‌ ప్రారంభించి పరిశీలించి, రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సురేందర్‌, రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌రావు, ఎంపీడీవో రాజేందర్‌, వ్యవసాయాధికారి తిరుపతినాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

స్వరాష్ట్రంలో పండగలా వ్యవసాయం

కొడిమ్యాల: మండలంలోని రైతు వేదిక వద్ద రైతు దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. తిర్మలాపూర్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవిశంకర్‌ హాజరై ఎడ్లబండిపై సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఒక్కచోట చేరి పంటల విధివిధానాలను చర్చించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నానరు. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని తెలిపారు. ఎకరానికి రూ.40 వేల ధరన్న భూములు రూ.40 లక్షలకు చేరాయని, రైతు బాధలు పట్టించుకున్నది భారాస ప్రభుత్వమేనన్నారు. ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్‌ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్‌, కృష్ణారావు, రాజనర్సింగరావు, రాజేందర్‌, రవీందర్‌రెడ్డి, ఏవో జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కృషి

కోరుట్లగ్రామీణం: రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. శనివారం కథలాపూర్‌ మండలంలోని భూషణ్‌రావుపేట గ్రామంలో రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూషణ్‌రావుపేట గ్రామంలో ఎడ్లబండిపై ఎమ్మెల్యే ఊరేగింపుగా రాగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గుండారపు సౌజన్య, ఏవో యోగిత, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని