logo

కాలానుగుణంగా మారితేనే సాగు లాభసాటి : మంత్రి

రైతులు కాలానుణంగా వస్తున్న సాగుమార్పులను అనుసరించాలని, వైవిధ్యభరిత పంటలతో ముందుకు సాగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు.

Published : 04 Jun 2023 05:03 IST

రైతును సన్మానిస్తున్న మంత్రి ఈశ్వర్‌, కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతులు కాలానుణంగా వస్తున్న సాగుమార్పులను అనుసరించాలని, వైవిధ్యభరిత పంటలతో ముందుకు సాగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు ఉత్తమ రైతులను సన్మానించి వ్యవసాయ ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులందరూ కేవలం వరి పంటనే సాగుచేయటంతో ధాన్యం సేకరణ భారంగా మారుతోందన్నారు. వంటనూనెలను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నందున రాష్ట్రప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో నీటిలభ్యత పెరిగి 3 సీజన్లలో పంటలను పండించగలుగుతున్నామని, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలను సాగుచేసి రైతులు ఆర్థికవృద్ధిని సాధించాలన్నారు. కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ భాషా, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ ప్రసంగించారు. ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ భారతిభట్, ఎంపీపీ పాలెపు రాజేంద్రప్రసాద్‌, రైతుబంధు కన్వీనర్‌ నక్కల రవీందర్‌రెడ్డి, అభ్యుదయ రైతు వెల్ముల రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ సొల్లు సురేందర్‌, శాస్త్రవేత్తలు, అధికారులు, బోధనేతర సిబ్బంది, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు