logo

ఆవిష్కరణల్లో అదుర్స్‌

తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2022-23లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ప్రస్తుత సమాజంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపేందుకు వారు రూపొందించిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

Published : 04 Jun 2023 05:03 IST

స్కూల్‌ ఇన్నోవేషన్‌లో 8 బృందాల ఎంపిక

పూరీ తయారీ యంత్రంతో విద్యార్థిని

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2022-23లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ప్రస్తుత సమాజంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపేందుకు వారు రూపొందించిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా  1300 మంది విద్యార్థులు ఆలోచనలు పంపించారు. సృజనాత్మకంగా నిల్చిన రాష్ట్రంలోని 70 ప్రాజెక్టులను నిర్వాహకులు ఎంపిక చేశారు. వీటిలో ఉమ్మడి జిల్లాలోని 8 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవి ఉండడం విశేషం.

కరీంనగర్‌ జిల్లా నుంచి నాలుగు ఎంపిక కాగా, గంగాధర మండలం గర్షకుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులవి రెండు ఉండడం గమనార్హం. వీరి ఆవిష్కరణలపై వెలువరించిన ఆలోచనలకు సంబంధించిన ప్రాజెక్టులను త్వరలో విద్యార్థులు గైడ్‌ టీచర్ల సహకారంతో రూపొందించనున్నారు. నిర్వాహకులు ఎంపికైన వారికి బూట్‌ క్యాంపును నిర్వహించనున్నారు. నిపుణులు  విద్యార్థుల ప్రాజెక్టులును మరింత నైపుణ్యంగా, సృజనాత్మకంగా మార్చడంతోపాటు వాటి పనితీరు ఉత్తమంగా నిలిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, పరికరాలను సమకూర్చుతారు. ఈనెల 5 నుంచి 15 వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు గ్రాండ్‌ ఫినాలేను ఏర్పాటు చేస్తారు. కరీంనగర్‌ జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులను డీఈవో జనార్దన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి సి.హెచ్‌.జయపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం.స్వదేశ్‌కుమార్‌, బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ అనంతాచార్యలు అభినందించారు.

నాలుగు జిల్లాల నుంచి..: కరీంనగర్‌ జిల్లా నుంచి జి.సాయివర్దన్‌, ఎండీ.ఆదిల్‌, ఎండీ.ఉజైర్‌, ఫైజాన్‌పాష (మైనారిటీ గురుకుల పాఠశాల, బాలుర-2, కరీంనగర్‌), డి.శ్రీజ, డి.ప్రత్యూష, జి.శశాంక్‌, ఆర్‌.హరిచరణ్‌ బృందం, కె.సహస్ర, ఎ.వాణిశ్రీ, బి.రచన, ఎం.రితిక బృందం(జడ్పీ ఉన్నత పాఠశాల, గర్షకుర్తి), కె.నరేశ్‌, కె.ప్రగ్యాన్‌ విశ్వాస్‌, కె.హోంరాజ్‌, జి.విలోహిత్‌(సైనిక్‌ పాఠశాల, రుక్మాపూర్‌) ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి ఎం.భవ్యశ్రీ, ఇ.పావని, ఎ.రాజ్‌కుమార్‌, ఎ.అక్షయ (జడ్పీ ఉన్నత పాఠశాల, రంగంపేట), పెద్దపల్లి జిల్లా నుంచి టి.శ్రీహాస, జి.సింధూజ (ఆదర్శ పాఠశాల, ధర్మారం)లను ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఎం.రాంచరణ్‌, డి.ప్రణయ్‌కుమార్‌, ఎం.సుప్రియ, ఇ.శ్రీచైత్ర (జడ్పీ ఉన్నత పాఠశాల, దమ్మన్నపేట), ఎల్‌.సహస్ర, టి.హరివర్దన్‌, ఎల్‌.స్పందన, డి.రేఖ (జడ్పీ ఉన్నత పాఠశాల, అల్మాస్‌పూర్‌) ఎంపికయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు