ఇంకుడుగుంత.. తీరని చింత
ప్రతీ నీటి బొట్టు భూగర్భంలో ఇంకేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడుగుంతల కార్యక్రమ ప్రగతి ఆరంభ శూరత్వంగా మారింది. మొదట్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది.
బిల్లులు అందక నిలిచిన నిర్మాణాలు
పెద్దపల్లి మండలంలో నిర్మించిన ఇంకుడుగుంత
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రతీ నీటి బొట్టు భూగర్భంలో ఇంకేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడుగుంతల కార్యక్రమ ప్రగతి ఆరంభ శూరత్వంగా మారింది. మొదట్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. ఉపాధి హామీలో నిధులు కేటాయించడంతో పూరి గుడిసెలో ఉన్న పేదలు కూడా నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు. బిల్లుల చెల్లింపులో జాప్యం.. ఇతర కారణాలతో ప్రగతి ముందుకు సాగడం లేదు. పల్లెల్లో ఎక్కడికక్కడే మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా వానాకాలంలో ఇంటికో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని అధికారుల హడావుడి తప్ప రెండేళ్లుగా ఆ ఊసే కనిపించడం లేదు.
ఉద్దేశం ఇదే..
పల్లెల్లో మరుగు, వర్షపు నీరు రహదారులపై చేరి అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. ఏటికేటా వర్షం నీరు వృథాగా పోతోంది. భూగర్భ జలాలను పెంపొందించి వృథా నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆరేళ్ల క్రితం ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రోత్సహించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేశారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి అనుమతి ఇచ్చారు. గ్రామాల్లో స్వశక్తి సంఘాల మహిళలు ఇంటింటికి వెళ్లి ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు. పల్లెల స్వచ్ఛత కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపడంతో ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 2,65,529 ఇంకుడుగుంతలు ప్రతిపాదించగా 1,48,878 పూర్తయ్యాయి. మిగిలినవి ప్రగతిలో కొనసాగుతున్నాయి.
అడ్డంకులు ఇవి..
బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాల సాధనలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంత తవ్వుకోవాలని చైతన్యం చేశారు. ఇంకుడుగుంత నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. సంపూర్ణ పారిశుద్ధ్య క్రతువులో కీలకమైన ఇంకుడుగుంతల లక్ష్యం నెరవేరడం లేదు. ఏళ్ల తరబడి బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల నిలిచిన పనులను పూర్తి చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.11,998.45 లక్షల వ్యయంతో 2,65,529 ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రతిపాదించగా 1,48,878 నిర్మించారు. రూ.5651.53 లక్షలు ఖర్చయ్యాయి.
పెరిగిన వ్యయం
ఇంకుడుగుంతల నిర్మాణ వ్యయం పెరిగింది. 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్లలోతు తవ్వి, అందులో గులకరాళ్లు, ఇసుక మిశ్రమం నింపుతున్నారు. గతంలో ఒక్కోదానికి రూ.4,226 ఉండగా ప్రస్తుతం రూ.6,096 చెల్లిస్తున్నారు. పెరిగిన ముడిసరకుల ధరలకు అనుగుణంగా వ్యయాన్ని పెంచినా ఫలితం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గ్రామాల్లో చేతిపంపులు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆవరణంలో నిర్మించుకోవాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా తవ్వుకునేందుకు ముందుకొచ్చినా బిల్లులు రాక వెనక్కి తగ్గుతున్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది.
అవగాహన కల్పిస్తున్నాం
గ్రామాల్లో ఇంకుడుగుంతల తవ్వకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్మించిన వాటికి బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాం. అసంపూర్తి వాటిని పూర్తి చేస్తాం. కొత్తగా కావాలంటే మంజూరు ఇస్తున్నాం.
శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
‘‘ఈమె పేరు తాటికొండ అంజలి. ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం ఇంకుడుగుంత నిర్మించుకున్నారు. బిల్లు కోసం అన్ని ఆధార పత్రాలు ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్లు రాలేదని అంజలి పేర్కొన్నారు.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
UPI: పండుగ షాపింగ్.. యూపీఐ పేమెంట్స్‌కే జై
-
Amy Jackson: లుక్‌పై విమర్శలు.. అమీ జాక్సన్ ఏమన్నారంటే..?
-
Nitish Kumar: నీతీశ్ వేడుకున్నా ఎన్డీఏలోకి తీసుకోం: భాజపా
-
Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్ మైండ్ ‘పన్నూ’..!
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్‌పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్