logo

ఈదురు గాలుల బీభత్సం

కోరుట్ల పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల తీవ్రతకు  కోరుట్ల - మెట్‌పల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది.

Published : 07 Jun 2023 02:15 IST

నేలకొరిగిన భారీ వృక్షాలు.. తెగిపడిన విద్యుత్తు తీగలు

రాఘవపేటలో ఎగిరిపోయిన రేకులు

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల తీవ్రతకు  కోరుట్ల - మెట్‌పల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జేసీబీతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. వేములవాడరోడ్డులోని శ్రీహనుమాన్‌ దేవాలయం ఆవరణలోని 60 ఏళ్ల మర్రివృక్షం నేలకూలింది. మార్కెట్‌యార్డు రోడ్డుపై ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోయి స్తంభంపైనున్న విద్యుత్తు తీగలకు చుట్టుకున్నాయి. వాటిని తొలగించేందుకు విద్యుత్తు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నక్కలగుట్ట, కల్లూరు రోడ్డు, మాదాపూర్‌కాలనీ, మెట్‌పల్లిరోడ్డు, చాలాకాలనీల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సాయిరాంపుర కాలనీలో రేకులషెడ్డు పూర్తిగా ఎగిరిపోయి రోడ్డుపైఉన్న విద్యుత్తు స్తంభంపై పడగా అది విరిగిపోయింది. తహసీల్దార్‌ కార్యాలయం ముందు వరద నీరు అడుగు మేర నిలవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

మల్లాపూర్‌ : మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి రాఘవపేట - మెట్‌పల్లి మార్గంలో పలుచోట్ల చెట్లు రహదారిపై కూలిపోగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సర్పంచి లావణ్య ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది రహదారిపై పడిపోయిన చెట్లను గంటపాటు శ్రమించి తొలగించడంతో ట్రాఫిక్‌ అంతరాయం తొలగింది. రాఘవపేట గ్రామంలో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో రూ.లక్షల్లో ఆస్తినష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను తహసీల్దార్‌ రవీందర్‌ పరిశీలించారు.

వేములవాడరోడ్డులోని హనుమాన్‌ ఆలయంలో నేలకొరిగిన మర్రివృక్షం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని