logo

రైతుబంధుకు సన్నాహాలు

ప్రస్తుత వానాకాలం సీజనుకుగాను రైతుబంధు సాయాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో మొత్తం 2,31,151 పట్టాదారులుండగా గడచిన యాసంగిలో 2,14,389 మంది రైతులకు రూ.206.13 కోట్ల నిధులందాయి.

Published : 07 Jun 2023 02:15 IST

న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం : ప్రస్తుత వానాకాలం సీజనుకుగాను రైతుబంధు సాయాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో మొత్తం 2,31,151 పట్టాదారులుండగా గడచిన యాసంగిలో 2,14,389 మంది రైతులకు రూ.206.13 కోట్ల నిధులందాయి. మరణించిన రైతుల వివరాలను జాబితాలోనుంచి తొలగించటం, వ్యవసాయ భూములను పూర్తిగా విక్రయించినవారు, నూతనంగా భూముల కొనుగోలు, విరాసత్‌ ద్వారా పట్టామార్పిడి చేయించుకున్నవారు సకాలంలో పథకం పరిధిలోకి రాకపోవటం, వివాదాలు, వ్యవసాయేతర భూములు తదితర కారణాలతో లబ్ధిదారుల సంఖ్య ఏ సీజన్‌లోనూ గరిష్ఠ స్థాయికి చేరటంలేదు.

* ఈ సీజనుకుగాను నిధుల పంపిణీకి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారినుంచి త్వరలోనే బ్యాంకు, ఆధార్‌నెంబరు తదితర వివరాలను తీసుకోనున్నారు. జిల్లాలో 6,155 మంది నూతన పట్టాదారులు ఉండగా వీరితోపాటుగా గత సీజన్లలో వివరాలివ్వనివారు, వివరాలిచ్చినా సరిగాలేక నిధులు జమగానివారు మరో 1,200 మందికిపైగా ఉన్నారు. కాగా గత సీజన్లలో నిధులందినవారు ప్రస్తుతం ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ జిల్లా అధికారి పాక సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. నూతన పట్టాదారులు, గతంలో నిధులు రానివారు, వివరాలివ్వనివారు త్వరలోనే ఆయా క్లస్టర్ల ఏఈవోలవద్ద దరఖాస్తు ఫారం తీసుకొని భూమి పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు నకలు ప్రతులతో దరఖాస్తు చేయాలన్నారు. కాగా గత సీజన్‌లో ఎలాంటి భూ పరిమితి విధించకుండా రైతులందరికీ ఎకరాకు రూ.5 వేల చొప్పున నిధులిస్తామని పేర్కొన్నా చాలామందికి నిధులందలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి అందరికీ నిధులను విడుదల చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని