ఆధార్ నమోదుకు తపాలా శాఖ ఏర్పాట్లు
ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు.. పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డుల్లో వివరాలు తాజాగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
పోస్టాఫీసుల్లో శాశ్వత కేంద్రాలు
సవరణలకు అవకాశం
జమ్మికుంట సబ్ పోస్టాఫీస్‌లో ఆధార్ కార్డు నమోదుకు ఐరిస్ చిత్రీకరణ
న్యూస్‌టుడే, జమ్మికుంట: ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు.. పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డుల్లో వివరాలు తాజాగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందు కోసం తపాలా శాఖ ప్రధాన పోస్టాఫీసుల్లో తాజాగా శాశ్వత ఆధార్ కార్డుల నమోదు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు ప్రధాన పోస్టాఫీస్‌ల్లో ఆధార్ నమోదును చేపట్టింది. ఈ నెల చివరి దాకా ఆధార్ కార్డుల నమోదు మాసోత్సవంగా విస్తృతంగా సేవలు అందించేందుకు సిబ్బంది నిమగ్నమయ్యారు.. కొత్తగా ఆధార్ కార్డులు తీసుకునే వారికి, పాత కార్డులో తప్పిదాల సవరణకు సిబ్బంది సేవలు అందించనున్నారు. కొత్తగా కార్డులు తీసుకునే వారికి ఉచితంగా వివరాల నమోదు, కార్డుల జారీ చేయనున్నారు. పదేళ్ల క్రితం తీసుకున్న కార్డుల్లో సవరణలు, ఇతర వివరాల నమోదుకు నిర్ణీత ఫీజును నిర్ణయించారు.
* ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లి పోస్టల్ డివిజన్‌లోని జమ్మికుంట, గోదావరిఖని, జ్యోతినగర్ సబ్ పోస్టాఫీస్‌ల్లో ఇప్పటికే ఆధార్ నమోదు కేంద్రాలను ప్రారంభించామని పెద్దపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్‌లోని కరీంనగర్ (హెడ్ పోస్టాఫీస్), మెట్‌పల్లి సబ్ పోస్టాఫీస్‌ల్లో ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను చేపట్టారు.
* పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, హుజూరాబాద్, బసంత్‌నగర్, మంథని, రామగుండం, సుల్తానాబాద్ పోస్టాఫీస్‌లలో త్వరలోనే ఆధార్ నమోదు కేంద్రాలు ఆరంభం కానున్నాయి. కరీంనగర్ డివిజన్ పరిధిలోని సిరిసిల్ల, ముకరంపుర, చొప్పదండి, హుస్నాబాద్, వేములవాడ, కోరుట్ల పోస్టాఫీసుల్లో త్వరలోనే ఆధార్ కార్డుల నమోదు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
ఈ మార్పులు చేసుకోవచ్చు
* ఆధార్ కార్డుల్లో చరవాణి నంబరు మార్పు
* బయోమెట్రిక్ అప్‌డేట్
* 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ వివరాలు ఉచితంగా నమోదు
* పుట్టిన తేదీల తప్పిదాల్లో మార్పులు
* ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా, పాత చిత్రాలు మార్పు చేయటం, ఇతర అన్ని సవరణలు
* కొత్తగా ఆధార్ కార్డు కోసం వివరాల నమోదు ఉచితంగా చేస్తారు.
ఆధార్ కేంద్రాలను వినియోగించుకోవాలి
ఆధార్ కార్డుల నమోదు, సవరణల కోసం పోస్టాఫీసుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల ఆధార్ కార్డుల నమోదు ప్రత్యేక మాసోత్సవంగా సిబ్బంది విస్తృతం సేవలు అందిస్తారు. పోస్టాఫీసుల్లో శాశ్వతంగా ఆధార్ కార్డులకు సంబంధించిన కౌంటర్ల నిర్వహణ జరుగుతుంది. ఆధార్ కార్డుల వివరాల నమోదుకు ధ్రువీకరణ పత్రాలను సిబ్బందికి చూపించాలి. కేంద్రాల్లో ఆధార్ నమోదు, సవరణలు, ఆధార్ ప్రింటింగ్ ఇస్తారు. పోస్టాఫీస్‌ల్లోని కేంద్రాలను వినియోగించుకోవాలి.
ప్రభాకర్, పోస్టల్ సూపరింటెండెంట్, పెద్దపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య