సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందని శానసమండలిలో ప్రభుత్వ ఛీప్ విప్ భానుప్రసాద్‌రావు అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో శాసనమండలి చీఫ్‌విప్ భానుప్రసాద్‌రావు
కార్యక్రమంలో మాట్లాడుతున్న భానుప్రసాద్‌రావు, చిత్రంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారిణి సంగీత, ప్రజాప్రతినిధులు, అధికారులు
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావం తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందని శానసమండలిలో ప్రభుత్వ ఛీప్ విప్ భానుప్రసాద్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లిలో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కిట్ పథకంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్యవివాహాలు నిలిచిపోయాయన్నారు. బీడీకార్మికులకు, ఒంటరి మహిళలకు ఉపాధిపై భరోసా కలిగిందన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందన్నారు. జిల్లా పాలనాధికారిణి డా.సర్వే సంగీత మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు.
36 మందికి ఇళ్ల స్థలాలు
ఈ సందర్భంగా జిల్లాలోని 36 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు పథకాల్లో మంజూరైన రూ.78.60 లక్షల విలువైన యూనిట్లను అందజేశారు. దివ్యాంగులకు మూడుచక్రాల వాహనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్‌సింగ్, జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ రేణుక, జిలా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, జిలా సంక్షేమ అధికారి రవూఫ్‌ఖాన్, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఆరు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. మొదటి విడతలో 5,660 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయగా రెండో విడతలో 6,162 మందికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్