విద్యార్థులకు వరం అల్పాహారం!
పాఠశాలల విద్యార్థులకు దసరా కానుకగా ఉదయం అల్పాహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది హడావుడిగా ఖాళీ కడుపులతో తరగతులకు హాజరవుతుంటారు.
దసరా నుంచి ప్రారంభానికి చర్యలు
న్యూస్‌టుడే-కరీంనగర్ విద్యావిభాగం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు.. ఉన్నత పాఠశాలలు దూరంగా ఉండడంతో గంట ముందు బయల్దేరుతున్నారు. ఆ సమయంలో వారి ఇళ్లల్లో అల్పాహారం వండకపోవడంతో తినకుండానే వస్తున్నారు.
- ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లా విద్యా శాఖ నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులకు గంటన్నర ముందుగానే విద్యార్థులు హాజరవుతుంటారు. సాయంత్రం కూడా గంట ఆలస్యంగా ఇళ్లకు వెళ్తుంటారు. కేవలం మధ్యాహ్న భోజనంతోనే ఆకలి తీర్చుకునేవారు. అల్పాహారానికి దాతలపై ఆధారపడాల్సి వచ్చేది.
- 2015లో కేంద్ర విద్యా శాఖ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంపై సర్వే నిర్వహించిన సందర్భంలో 30 శాతం విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు హాజరవుతున్నట్లు తేలింది. రక్తహీనతతోపాటు బలహీనంగా తయారవుతున్నట్లు గుర్తించింది.
పాఠశాలల విద్యార్థులకు దసరా కానుకగా ఉదయం అల్పాహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది హడావుడిగా ఖాళీ కడుపులతో తరగతులకు హాజరవుతుంటారు. ఈ పరిస్థితితో వారిలో పోషకాహారం లోపించి, సన్నగా అవుతుంటారు. నీరసంగా ఉండడంతో అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. రక్తహీనతనూ బాధ పడుతుంటారు. అలాంటి వారికి ఈ నిర్ణయం వరంగా మారనుంది. తమిళనాడు సర్కారు తరహాలో మన రాష్ట్రంలోనూ అల్పాహారం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. ఇప్పటికే బడుల్లో మధ్యాహ్న భోజన పథకంతోపాటు రాగిజావను అమలు చేస్తున్నారు.
ప్రతిబంధకాలు అధిగమిస్తేనే...
పాఠశాలల్లో వంటకు మధ్యాహ్న భోజన కార్మికులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే రాగిజావాను ఉచితంగా వండి ఇవ్వమంటేనే భారం పడుతుందని వారంటున్నారు. అల్పాహారాన్ని వండాలంటే సిబ్బంది ఉదయం ఏడు గంటలకే బడికి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే వేతనాలు పెంచాలని, బిల్లులు క్రమంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలూ తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే వారు ముందుకొచ్చే అవకాశముంది. పథకం అమలు చేసే ముందు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది.
రాగి జావపై అనాసక్తి
సర్కారు బడుల్లో ఈఏడాది నుంచి రాగిజావను పంపిణీ చేస్తున్నారు. పంపిణీ కేంద్రం నుంచి ముడి సరకులు తీసుకెళ్లడం పాఠశాల సిబ్బందికి భారంగా మారింది. మరో వైపు కొందరు పిల్లలు రాగిజావ తాగేందుకు అనాసక్తి చూపుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం 11 గంటలకు ఇస్తుండడంతో.. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని మరికొందరు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికులకే రాగి జావ బాధ్యత అప్పగించడంతో కొన్ని ప్రాంతాల్లో అమలు కావడంలేదు.
తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు
అల్పాహారంలో ఏయే పదార్థాలు ఇస్తారో ప్రభుత్వం మార్గదర్శకాలు వెల్లడించాల్సి ఉంది. విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తే ప్రయోజనంగా ఉంటుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం ఒకే రకంగా కాకుండా, వారంలో వేర్వేరు రకాలుగా అందిస్తే పిల్లలు ఆసక్తి చూపుతారన్నారు. అన్ని రకాల పోషకాలూ లభిస్తాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం చూపే కొన్ని పదార్థాలను వారు సూచించారు. ఆ వివరాలు ఇలా..
- పొంగల్, కిచిడీ, సేమియా, రవ్వ ఉప్మా ఇవ్వొచ్చు.
- క్యారెట్లు ఇస్తే కళ్లకు మేలు చేసే ఏ విటమిన్ లభిస్తుంది. విద్యార్థులను అలసటకు దూరం చేస్తాయి.
- అరటి పండ్లు ఇస్తే పొటాషియం, తదితర పోషకాలు లభిస్తాయి
- పాలు అందజేస్తే విటమిన్లు, మినరల్స్ అందుతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.
- కాలానుగుణంగా దొరికే పండ్లను ఇవ్వొచ్చు.
- మొక్కజొన్న కంకులనూ ఇవ్వొచ్చు. పీచు పదార్థాలు అందుతాయి.
- పల్లీపట్టీలను అల్పాహారంగా ఇవ్వడంతో ఐరన్ లభిస్తుంది. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు