logo

వినాయక పూజకు వేళాయే

జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల పట్టణంతో పాటు, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మంటపాలను ముస్తాబు చేశారు.

Updated : 18 Sep 2023 05:54 IST

నేటి నుంచి నవరాత్రులు

మంటపాలకు తరలుతున్న వినాయక ప్రతిమలు

జగిత్యాల విద్యానగర్‌: జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల పట్టణంతో పాటు, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మంటపాలను ముస్తాబు చేశారు. వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు వేదికలు అందంగా అలంకరించడంతో పాటు విద్యుత్తు దీపాలు అమర్చారు. యువజన సంఘాలు, భక్త మండళ్ల ఆధ్వర్యంలో ఉత్సాహంగా వినాయక ప్రతిమలను వాహనాల్లో తరలించారు. వినాయక ప్రతిమలు,  పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మార్కెట్లో సందడి నెలకొంది.

పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యం

మార్కెట్లో విగ్రహాల దుకాణం వద్ద..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని