logo

తొమ్మిదేళ్ల పాలనలో అద్భుత ప్రగతి

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని, ఇదే అభివృద్ధిని మున్ముందు సాగించేందుకు ప్రజలు తోడ్పాటునివ్వాలని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టి.భానుప్రసాద్‌రావు అన్నారు.

Updated : 18 Sep 2023 05:58 IST

జెండా వందనం చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని, ఇదే అభివృద్ధిని మున్ముందు సాగించేందుకు ప్రజలు తోడ్పాటునివ్వాలని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టి.భానుప్రసాద్‌రావు అన్నారు. పెద్దపల్లి సమీకృత పాలనాధికారి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్‌ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ 75 ఏళ్లక్రితం ఇదే రోజున హైదరాబాద్‌ రాష్ట్రం సమైఖ్య భారతంలో కలిసిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగ ఫలితంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు తెలిపారు. విద్యుత్తు, సాగు, నీరు, విద్య, వైద్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, జిల్లా పాలనాధికారి ముజామిల్‌ఖాన్‌, డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, అదనపు పాలనాధికారులు శ్యాంప్రసాద్‌లాల్‌, అరుణశ్రీ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, పెద్దపల్లి పురపాలిక ఛైర్‌పర్సన్‌ మమతరెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ రేణుక, ఏసీపీ ఎడ్ల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న సీపీ రెమా రాజేశ్వరి

గోదావరిఖని: రామగుండం పోలీసు కమిషనరేట్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌లో జాతీయ జెండాను పోలీసు కమిషనర్‌ రెమా రాజేశ్వరి ఎగురవేసి గౌరవ వందనం చేశారు. వేడుకల ప్రాధాన్యతను వివరించారు. పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్సు ఏసీపీ మల్లారెడ్డి, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని