శ్రీగణనాథం.. ఇది జనహితం
నాయకుడు.. వినాయకుడు.. పేరుతో పాటు బాధ్యతల్లోనూ చాలా సారూప్యతలున్నాయి. వినాయకుడు లోకానికి వస్తున్నాడంటే హంగూ ఆర్భాటాలున్నట్లుగానే, రాజకీయ నాయకుడికీ ఘనంగా స్వాగత ఏర్పాట్లుంటాయి.
సేవా పథమే పూజా సమానం
న్యూస్‌టుడే, మేడిపల్లి: నాయకుడు.. వినాయకుడు.. పేరుతో పాటు బాధ్యతల్లోనూ చాలా సారూప్యతలున్నాయి. వినాయకుడు లోకానికి వస్తున్నాడంటే హంగూ ఆర్భాటాలున్నట్లుగానే, రాజకీయ నాయకుడికీ ఘనంగా స్వాగత ఏర్పాట్లుంటాయి. ఇక భజనల సంగతి చెప్పనక్కరలేదు. ఎప్పుడు ఎవరు ఎత్తుకుంటారో, ఎవరు నొచ్చుకుంటారో ఊహించడం కష్టమే.. పూజలందుకోవడంలో వినాయకుడు.. పూలదండల ముంపులో రాజకీయ నాయకుడు సంతోషం వెతుక్కుంటారు. సోమవారం వినాయకచవితికి గణనాథుడు అరుదెంచే వేళయింది.. మరోవైపు ఎన్నికల హడావుడి కూడా ఆరంభం కానుంది.. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు లంబోదరుడు దిశా నిర్దేశం చేస్తే ఎలా ఉంటుంది..? తాజా పరిస్థితులను, తన అనుభవాలను రంగరించి చేస్తున్న హితబోధ ఇది. నవరాత్రుల సందర్భంగా నేను చెబుతున్న విషయాలు పాటించి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు కదూ..
పదవులకు వన్నె తేవాలి
ఉమ్మడి కరీంనగర్ అంటేనే రాజకీయ చైతన్యానికి మారుపేరు. దేశానికి ప్రధానిని అందించిన జిల్లాగా గుర్తింపు ఉంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయాల్లో తల పండిన నేతలు, మంత్రులుగా మంచి పేరు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. పదవులకు వన్నె తేవడంతో పాటు జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచారు. మీరు కూడా వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటే బాగుంటుంది. స్థాయి ఏదైనా అభివృద్ధి, సేవా దృక్పథంతో పని చేస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది?
గణపతి బొప్పా.. గుణాలు గొప్ప
ఈనాడు, కరీంనగర్: తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా జరిపించాలంటూ గణపతికే తొలి పూజలు చేస్తాం. సిద్ధి బుద్ధి ప్రదాత అయిన ఆయన ఆకృతి చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంది. ‘గణపతి బప్పా మోరియా’ అని కీర్తించేలా చేస్తుంది. వినాయకుడి ఆకారంలో అసలైన పరమార్థం దాగుంది. తన రూపంతో మనిషి జీవన విధానానికి అసలైన మార్గం చూపిస్తున్నాడు. ఊరూ వాడా విఘ్ననాథుడిని కొలుస్తూనే ఆది దేవుడి నుంచి విలువైన విషయాలను గ్రహించి, నిత్య జీవితంలో ఆచరిద్దాం.
తీక్షణ వీక్షణకు సంకేతం
చిన్న కళ్లు విఘ్నేశ్వరుడి తీక్షణ శ్రద్ధను సూచిస్తున్నాయి. అందుకే భిన్నరకాల సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పెద్ద సమస్యనైనా గుర్తించేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. ప్రజా సేవలో మమేకమవుతూ బాధితుల పక్షాన నిలబడాలి. నాలుగు జిల్లాల కలెక్టరేట్‌లలో దాదాపుగా 6 వేల మంది సేవలందిస్తున్నారు. మరో 4 వేల మంది పోలీసులున్నారు. 33 లక్షల జనాభాలో వివిధ అవసరాల కోసం కార్యాలయ మెట్లెక్కే బాధితులకు వీరు అండగా నిలబడితే సమస్యలు ఇట్టే తీరుతాయి.
నిపుణతకు నిర్దేశనం
పార్వతీ తనయుడి వక్రతుండం ప్రత్యేకాకర్షణ. ఇది నిపుణతను సూచిస్తుంది. కాలానుగుణంగా మనిషి తన ప్రతిభను చూపాలనే సందేశమిస్తుంది. ఉమ్మడి జిల్లాలో సాంకేతిక సృజనతో అంకుర పరిశ్రమలు సహా స్వయం ఉపాధిలో రాణిస్తున్న యువత ఈ విషయాన్ని గమనించాలి. జిల్లా జనాభాలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారే 42 శాతం మంది ఉన్నారు. య్యూట్యూబ్, క్రీడలు సహా వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుతున్న యువత జిల్లా ఖ్యాతిని నిలిపేలా నైపుణ్యం చాటాలి.
ఆది దేవుడి ఆరోగ్య మంత్రం
లంబోదరుడు ఎంత తిన్నా అరిగించుకోగలడు. ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ సగటున 2 వేల మంది ఆసుపత్రులకు వెళ్తున్నారు. తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే చాలా మట్టుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సమతుల ఆహారాన్ని తీసుకుంటూ రుగ్మతలు దరి చేరకుండా జాగ్రత్త పడవచ్చు. జంక్‌ఫుడ్‌కు స్వస్తి చెప్పి వ్యాయామంతో శరీరాకృతిని కాపాడుకోవాలి.
గౌరీ తనయుడి ‘గురు’తు
విఘ్నాలను తొలగించే దేవుడు గురుశిష్యుల బంధానికి చక్కటి నిదర్శనం. వ్యాసుడు చెప్పినవన్నీ శ్రద్ధగా రాస్తూనే తల్లిదండ్రులను పూజించారు. గురువులను గౌరవించాలనే గొప్ప విషయాన్ని వినాయకుడి నుంచి నేర్చుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 6.78 లక్షల మంది విద్యార్థులు ఈ లక్షణాలను అలవరచుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగితే అంతకన్నా కావలసిందేముంది.
భజన కాదు.. జనమే ముఖ్యం
నా చుట్టూ చేరి భజన చేసే వారిలో తప్పులు వెతకలేం. కానీ నాయకులూ.. మీ చుట్టూ చేరి తాళం వేసే వారిపై ఓ కన్నేయండి. మిమ్మల్ని అదే పనిగా పొగుడుతూ అవతలి వారిని తిడుతుంటే జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారంతా రేపు మరొకరి చెంతకు వెళ్తారని మరువకండి. అందుకే కార్యకర్తలు, నాయకులను మాత్రమే కాదు.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోండి. జనానికి సేవ చేస్తూ వారి ప్రేమను గెలుచుకుంటే భజనపరులు ఎటు వెళ్లినా ఏమీ కాదని గుర్తుంచుకోండి.
మనసు గెలిస్తే ముంచేవారెవరు?
తొమ్మిది రోజులూ పూజలు చేసి చివరి రోజున చుట్టూ ఉన్న వారే నన్ను ముంచేస్తారని చతురోక్తి విసురుతుంటారు. నాయకుల విషయంలో మాత్రం ఇది నిజంగానే జరుగుతుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇంటి ముందు టపాసులు పేలతాయి. మెడ నిండా పూలదండలు మెరుస్తాయి. అదే అపజయం పాలైతే చాలా మంది ఇంటిగడప కూడా తొక్కరు. సాయం చేసే గుణముంటే మీరు ప్రజల మనసులు గెలుస్తారు. నీతి, నిజాయతీలే మీ ఎజెండా అయితే జనం గుండెల్లో నిలుస్తారు.
ఆర్భాటం అందరికీ చేటు
మూషిక వాహనంపై భూలోకానికి వచ్చినా నా ఇమేజీ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ మీరు మాత్రం చిన్న పదవి రాగానే ఆర్భాటాలకు పోతుంటారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నాయకులంతా అటు శబ్ధ కాలుష్యానికీ, ఇటు వాయు కాలుష్యానికీ కారణమవుతున్నారు. ఎన్నికల సమయంలో వాహనాల ర్యాలీలు సరేసరి. పార్టీలో చేరినప్పుడు, నామినేషన్ సమయంలో హంగూ ఆర్భాటం తగ్గిస్తే కాలుష్య నివారణతో పాటు ఖర్చు తగ్గించిన వారవుతారు.
ప్రజా సేవే ప్రపంచం
నా తమ్ముడికీ, నాకూ భూలోకం చుట్టూ తిరిగి వచ్చే పందెం గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగి రెండు చేతులా నమస్కరించాను. మీరు కూడా ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలు పట్టించుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఓటరు మహారాజును గౌరవిస్తేనే మంచి నాయకుడిగా గుర్తింపు లభిస్తుంది. సమస్యలపై మీ వద్దకు వచ్చినపుడు ఓపిగ్గా విని పరిష్కరిస్తే ప్రజాదరణ పెరిగి ఎల్లవేళలా వెలిగిపోతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: 2 రోజులుకే పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయి: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!