logo

మద్యం దుకాణాల్లో చోరీలు : ఇద్దరి అరెస్టు

జల్సాలకు అలవాటు పడి, నాలుగు మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు హుజూరాబాద్‌ ఏసీపీ జీవన్‌రెడ్డి తెలిపారు.

Published : 22 Sep 2023 04:23 IST

వివరాలు వెల్లడిస్తున్న హుజూరాబాద్‌ ఏసీపీ జీవన్‌రెడ్డి

జమ్మికుంట, న్యూస్‌టుడే : జల్సాలకు అలవాటు పడి, నాలుగు మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు హుజూరాబాద్‌ ఏసీపీ జీవన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ విలేకరులతో మాట్లాడారు. ఈనెల 8న నాగంపేటలో, 13న రాత్రి జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లి, ఇల్లందకుంటలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీకి పాల్పడ్డ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన బండా అరవింద్‌  తొడెటి ఓదెలును ఇల్లందకుంట బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ సమీపంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిద్దరు ఈనెల 8న జమ్మికుంట మండలం నాగంపేటలోని మద్యం దుకాణం వెనుకవైపు తలుపులు ధ్వంసం చేసి రూ.5వేలు, 13న జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లిలోని మద్యం దుకాణంలో రూ.5వేలు నగదు, ఇల్లందకుంటలోని ఓ మద్యం దుకాణంలో రూ.55వేలు, నాలుగు లిక్కర్‌ బాటిళ్లు, మరో మద్యం దుకాణంలో రూ.26 వేల నగదు చోరీ చేశారు. బైక్‌ వచ్చి మందుగా మద్యం దుకాణాలను పరిశీలించి, వ్యూహం ప్రకారం రాత్రిళ్లు వరుస చోరీలకు పాల్పడ్డారు. వైన్‌ షాపుల వెనుక నుంచి గొడ్డలితో తలుపులు ధ్వంసం చేసి, కౌంటర్లలోని నగదు అపహరించారన్నారు. సీపీ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టి ఇద్దరు దొంగలను అరెస్టు చేశామని, వారు ఉపయోగించిన బైక్‌, గొడ్డలి, రూ.91 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జమ్మికుంట గ్రామీణ సీఐ కిషోర్‌, ఎస్సై రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను అరెస్టు చేశామన్నారు.చోరీ కేసులను ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని