logo

అమ్మను వదిలించుకున్నారు

నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని వదిలించుకున్నారు. వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన వారు ఓ చెట్టు కింద వదిలేసి మానవత్వాన్ని మంట గలిపారు.

Updated : 22 Sep 2023 06:29 IST

అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలు

వేములవాడ, న్యూస్‌టుడే: నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని వదిలించుకున్నారు. వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన వారు ఓ చెట్టు కింద వదిలేసి మానవత్వాన్ని మంట గలిపారు. అచేతనంగా ఉండి చీకట్లో మగ్గుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దిక్కులు చూస్తున్న ఆ వృద్ధురాలిని చూసిన వారి గుండెలు కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... వేములవాడ మున్సిపల్‌ పరిధిలో నందికమాన్‌ ప్రాంతంలోని ఓ చెట్టు వద్ద దాదాపు 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలిని  నాలుగు రోజుల క్రితం వదిలి వెళ్లారు. అచేతనంగా ఉన్న ఆమెను చూసిన పక్కనున్న ఇటుకల తయారీ కార్మికులు రొట్టెలు, నీళ్లు, అరటి పండ్లు అందజేశారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పలేకపోతుంది. ఓ సారి నాంపల్లి గ్రామమని, మరోసారి తిమ్మాపూర్‌, ఇంకోసారి నర్సింగాపూర్‌ గ్రామమని, తన పేరు బూదవ్వ అంటూ పొంతన లేని మాటలు చెప్పడంతో చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని తెలిపింది. ఈ విషయం తెలుసుకొన్న పట్టణ సీఐ కరుణాకర్‌ గురువారం రాత్రి ఆమె వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. సఖి కేంద్రం అధికారులు ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించారని, సరైన వివరాలు చెప్పడం లేదని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు