logo

రాజన్నకు కాసుల శ్రావణం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి శ్రావణ మాసం కాసుల వర్షం కురిపించింది.

Updated : 22 Sep 2023 06:28 IST

రూ. 8.63 కోట్లు సమకూరిన ఆదాయం
న్యూస్‌టుడే, వేములవాడ

రాజన్న ఆలయం

క్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి శ్రావణ మాసం కాసుల వర్షం కురిపించింది. ఆలయంలోని వివిధ విభాగాల ద్వారా స్వామివారికి  రూ.8.63 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా రావడంతో ఆదాయం కూడా పెరిగింది.

శ్రావణంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. వారు సమర్పించిన కానుకలతో ప్రధాన హుండీలు నిండిపోయాయి. సాధారణంగా శుక్ర, ఆది, సోమవారాల్లో రాజన్న దర్శనానికి పోటెత్తారు. శ్రావణంలో మాత్రం అన్ని రోజుల్లోనూ భారీగా తరలి వచ్చారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన బద్ది పోచమ్మ, నాంపల్లి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు కిటకిటలాడాయి. ఆగస్టు 17న మొదలైన శ్రావణం సెప్టెంబరు 14న ముగిసింది. ఈ నెలంతా రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వారు వేసిన కానుకలతో హుండీలు నిండిపోవడంతో అధికారులు లెక్కించారు. కేవలం హుండీ ద్వారానే రూ. 3.37 కోట్లు వచ్చింది. అన్ని విభాగాలు కలిపి మొత్తం రూ. 8.63 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే కొంత మేరకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని