logo

Karnataka: నాకూ సీఎం పదవి కావాలి..

నాకూ ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశ ఉందని ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి ఉమేశ్‌ కత్తి ప్రకటించారు. బాగల్‌కోటె జిల్లా ఇన్‌ఛార్‌్్జ మంత్రి అయిన ఆయన సోమవారం ఇక్కడ అభివృధ్ధి సమీక్షా సమావేశానంతరం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. అనేకసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించానని, ముఖ్యమంత్రి

Updated : 06 Jul 2021 09:09 IST


మాట్లాడుతున్న ఉమేశ్‌ కత్తి

బాగలకోటె, న్యూస్‌టుడే : నాకూ ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశ ఉందని ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి ఉమేశ్‌ కత్తి ప్రకటించారు. బాగల్‌కోటె జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన ఆయన సోమవారం ఇక్కడ అభివృధ్ధి సమీక్షా సమావేశానంతరం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. అనేకసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించానని, ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతులున్నాయన్నారు. అవకాశం అందివస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ దఫాలోనే ఆ అవకాశం ఆశిస్తున్నట్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘నాకు ఇంకా 60 సంవత్సరాలే. మరో 15 సంవత్సరాల వరకు ఆ పదవి అందుకునే- పాలించే శక్తియుక్తులు నాకున్నాయి’ అని ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని