logo
Updated : 27 Sep 2021 10:16 IST

Fine: ఆలయంలో ప్రవేశించిన దళితుడికి జరిమానా

మహాలక్ష్మీ ఆలయం

గంగావతి, న్యూస్‌టుడే: ఆలయంలో ప్రవేశించి పూజలు చేసిన దళిత వ్యక్తికి పాలకమండలి జరిమానా విధించిన సంఘటన కారటగి తాలూకా నాగనకల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన ఈ నెల 11న జరగ్గా పోలీసులు శనివారం సుమోటో కింద కేసు నమోదు చేశారు. సింధోళ వర్గానికి చెందిన మారెప్పకు ఆలయ పాలకమండలి రూ.11 వేల జరిమానా విధించింది. కారటగికి చెందిన ఈ వ్యక్తి ఆలయంలో ప్రవేశించి పూజ చేయడాన్ని అర్చకుడు గమనించారు. ఈ విషయాన్ని ఆయన ఆలయసమితి దృష్టికి తీసుకురావడంతో వారు విచారణ జరిపి జరిమానా విధించారు. అర్చకులు శంక్రప్ప బడిగేర్‌, ఆలయ సమితి సభ్యులు శేఖరప్ప, శరణప్ప వీరభద్రప్ప, ప్రశాంత్‌ రాయప్ప, బసవరాజ్‌ తళవార్‌, కాడప్ప నాయక్‌, దురగేశ్‌లపై కేసు నమోదైంది. ఈ సంఘటనపై సమాచారం సేకరించేందుకు తాలూకా యంత్రాంగం ప్రయత్నించినట్లు కారటగి ఎస్‌.ఐ. యల్లప్ప తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడంతో సుమోటో కింద కేసు నమోదు చేశామన్నారు.

కొప్పళలో కనుమరుగవ్వని అంటరానితనం

కొప్పళ జిల్లాలో అంటరానితనం ఇంకా సజీవంగా ఉంది. ఒకే నెలలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కుష్ఠగి తాలూకా మియాపూర్‌లో జరిగిన సంఘటనను మరవకముందే కారటగి తాలూకాలో మరొకటి వెలుగు చూసింది. మియాపూర్‌లో నాలుగేళ్ల బాలుడి పుట్టినరోజు పురస్కరించుకుని తండ్రి గుడికి తీసుకెళ్లారు. మారుతేశ్వర ఆలయం వెలుపల నుంచి నమస్కరిస్తుండగా వర్షం ప్రారంభమైంది. అభంశుభం తెలియని చిన్నారి వర్షం నుంచి తలదాచుకునేందుకు గుడిలోకి వెళ్లాడు. వెంటనే తండ్రి ఆలయంలోకి వెళ్లి బాలుడిని బయటకు తీసుకొచ్చారు. విషయం తెలిసి గ్రామపెద్దలు ఆ కుటుంబానికి రూ.25 వేల జరిమానా విధించారు. ఈ విషయాన్ని చెన్నదాసర వర్గం వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనల్లో ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదు. పోలీసులే సుమోటోగా కేసులు నమోదు చేయడం గమనార్హం.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని