logo
Published : 30/09/2021 05:58 IST

విద్యార్థులను వెంటాడుతున్న వైరస్‌

 

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు శివార్లలోని ఓప్రైవేట్‌ కళాశాల వసతి గృహంలో ఉండే విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ వసతి గృహంలో 54 మందికి పాజిటివ్‌ నివేదికలు రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హోసూరు రోడ్డులోని సింగేన అగ్రహార సమీపంలో ఉన్న ఓ రెసిడెన్షియల్‌ కళాశాల విద్యార్థి వసతి గృహంలో 335 మంది విద్యార్థులు ఉన్నారు. మూడు బ్లాక్‌లలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. వైద్యాధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులను సమీపంలోఉన్న ఆసుపత్రులకు తరలించి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వసతి గృహానికి వెళ్లే దారులను పాలికె అధికారులు సీల్‌డౌన్‌ చేశారు. వైరస్‌ వ్యాపించకుండా చుట్టు పక్కల ముందస్తు చర్యలు చేపట్టారు. రసాయనిక మందులను పిచికారీ చేశారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని