logo
Published : 27/11/2021 01:11 IST

దొంగ అరెస్టు: బంగారు ఆభరణాలు స్వాధీనం

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

బళ్లారి, న్యూస్‌టుడే: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరక్కుండా తిరుగుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేసి రూ.4.59 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సైదులు అడావత్‌, నగర డీఎస్పీ రమేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు కౌల్‌బజార్‌ సీఐ సుభాష్‌ చంద్ర తమ సిబ్బంది శుక్రవారం నగరంలో గస్తీ తిరుగుతున్న సమయంలో స్థానిక హొసపేటె రహదారిలోని ఏళుమక్కళ దేవస్థానం వద్ద అనుమానంగా తిరుగుతున్న అజేయను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతని నుంచి బంగారు ఆభరణాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. అజేయను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు సీఐ సుభాష్‌ చంద్ర తెలిపారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని