logo
Published : 27/11/2021 01:11 IST

ప్రముఖుల రాకతో హంపీలో సందడి

హంపీ విరూపాక్ష ఆలయ ఆవరణలో అమెరికా దౌత్యవేత్త ప్యాట్రిసియా ల్యాసినా

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రముఖుల రాకతో శుక్రవారం హంపీలో సందడి నెలకొంది. భారత్‌లో అమెరికా దౌత్యవేత్త ప్యాట్రిసియా ల్యాసినా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌(జీవనకళ) సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ గురూజీ హంపీలో ప్రత్యేకంగా పర్యటించారు. అమెరికా దౌత్యవేత్త ల్యాసినా స్నేహితులతో కలిసి హంపీ పర్యటనకు వచ్చారు. తొలుత విరూపాక్ష ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని పట్టుశాలువాతో సన్మానించారు. అనంతరం వారు ఎదురుబసవణ్ణ ఆలయం, కృష్ణ ఆలయం, విజయవిఠల ఆలయం, రాతిరథాలను తిలకించారు. రవిశంకర్‌ గురూజీ కూడా హంపీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యటించి ప్రముఖ స్మారకాలను తిలకించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

హంపీ పరిసరాల్లో పర్యటిస్తున్న రవిశంకర్‌ గురూజీ​​​​​​​

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని