logo
Published : 27/11/2021 01:11 IST

ప్రధాని హామీలు నమ్మవద్దు

సింధనూరు కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌.ఎస్‌.బోసురాజు

సింధనూరు, న్యూస్‌టుడే: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాల కళ్లకు పేదలు, రైతులు కనపడరు..వారికి కార్పొరేట్‌ సంస్థలు, కోట్లకు పడగలెత్తిన ఆగర్భ శ్రీమంతులే కనిపిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎస్‌.బోసురాజు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సిద్ధరామయ్య పేదల కోసం అమలు చేసిన ఎన్నో పథకాలను రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం పక్కనపెట్టేసింది. పేదలకు ఇళ్లు లేవు..నరేగా పథకానికి నిధులు లేవు. ప్రధాని మోదీ దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులంతా అబద్దాలకోరులని బోసురోజు దుయ్యబట్టారు. శుక్రవారం సింధనూరు పీడబ్ల్యూ డీక్యాంపులోని అన్నదానేశ్వర కల్యాణ మంటపంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేసిన భాజపా ప్రభుత్వం జడ్పీ, టీపీ ఎన్నికలు జరగకుండా తాత్సారం చేస్తోందని బోసురాజు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్‌ అభ్యర్థి శరణేగౌడ బయ్యాపూరును గెలిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాదర్లి మాట్లాడారు. మాజీ మంత్రులు రాయరెడ్డి, అమరేగౌడ బయ్యాపూరు, ఎమ్మెల్యేలు రాఘవేంద్ర హిట్నాళ, ఆర్‌.బసనగౌడ, హులగేరి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీ.వి.నాయక్‌, సీనియర్లు వసంతకుమార్‌, ఎంఎల్‌సీ అభ్యర్థి శరణేగౌడ బయ్యాపూరు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని