logo
Published : 27 Nov 2021 01:11 IST

రాజ్యాంగమే శిరోధార్యం

చెళ్లకెర: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రకాష్‌మూర్తి, దళిత సంఘ సభ్యుల నివాళి

బళ్లారి, న్యూస్‌టుడే: పెట్టుబడిదారులు బలపడితే....రాజ్యాంగం కాపాడటం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుతూ...సంరక్షించాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం అభివృద్ధి, అధ్యయన విభాగం అచార్యులు డా.ప్రశాంత్‌ సూచించారు. యు.భూపతి స్మారక ట్రస్ట్‌, కళాశాల రాజనీతిశాస్త్రం సంయుక్తంగా శుక్రవారం ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్‌ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి, డా.వసుంధర భూపతి ‘టీనేజ్‌ తల్లణ’ పుస్తకం విడుదల చేసి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు...సమకాలీన అభివృద్ధిపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. ఉచిత, నిర్బంధ విద్యాహక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వాలు ప్రస్తుతం నూతన విద్యా చట్టం అమలు చేయడంతో..భవిష్యత్తులో విద్యా ప్రైవేటీకరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. సాహితీ అల్లమప్రభు బెట్టనూరు, వసుంధర యు.భూపతి, ప్రధాన ఆచార్యులు హేమణ్ణ, డా.అరవింద్‌ పాటిల్‌, వెంకమ్మ, పి.ఆర్‌.వెంకటేశ్‌, అబ్దుల్‌, కరిబసమ్మ, రేవణ్ణ, విజయకుమార్‌ మాట్లాడారు. అనంతరం రాజ్యోత్సవ పురస్కార గ్రహీత రమేష్‌గౌడ పాటిల్‌కు సన్మానం చేశారు. బళ్లారి అల్లం సుమంగళమ్మ మహిళ స్మారక కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కళాశాల అధ్యక్షురాలు కుప్పగల్‌ గిరిజా, ప్రధాన ఆచార్యులు డా.తిమ్మారెడ్డి, డా.గోవిందరాజులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని