logo
Published : 27 Nov 2021 01:11 IST

దీపోత్సవానికి విదేశీయులు ఫిదా

దీపోత్సవం ఎంత బాగా ఉందో చూడు..

●●●కార్వార: ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణలో గురువారం రాత్రి కోటి తీర్థంలో నిర్వహించిన దీపోత్సవం విదేశీయులను మంత్రముగ్ధులను చేసింది. విదేశీయులు పాల్గొన్న ఛాయాచిత్రాల్ని వెనువెంటనే విడుదల చేయలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. కోటి తీర్థంలో నిర్వహించిన దీపోత్సవంలో వంద మందికి పైగా విదేశీ మహిళలు, చిన్నారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కరోనా నియంత్రణలోకి రావడంతో పక్షం రోజులుగా విదేశీయులు పెద్దసంఖ్యలో గోకర్ణకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఐదు వేల మందికి పైగా విదేశీయులు ఇక్కడ ఉన్నట్లు అంచనా. సాధారణంగా ఈ సమయంలో పది వేల మందికి పైగా విదేశీయులు గోకర్ణలో బసచేసేవారు. నవంబరులో వచ్చే విదేశీయులు మార్చి- ఏప్రిల్‌ నెల వరకు ఇక్కడే బసచేసి వెనుతిరుగుతుంటారు. వీరి కోసమే పట్టణంలో ప్రత్యేక హోటళ్లు కూడా ఏర్పడ్డాయి.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని