logo
Published : 27/11/2021 01:11 IST

రక్తం చిందిన టమోటా తోట

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : టమోటా తోట చుట్టూ అమర్చిన విద్యుత్తు కంచె తగిలి వసంతరావు (28) అనే యువకుడు మరణించాడు. అతని బంధువులు ఆగ్రహించి పొలం యజమాని అశ్వత్‌రావు (50)ను కొట్టి కడతేర్చిన ఘట్టం విషాదం నింపింది. చిక్కబళ్లాపుర జిల్లా, గౌరీబిదనూరు తాలూకా, చరకమత్తెనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో మరణించిన వసంతరావు గోపాలకుడు. టమోటాకు చక్కని ధర ఉండడం, పశువులు, కుందేళ్లు, వన్యప్రాణులు నష్టం చేయకుండా అశ్వత్‌రావు తన పొలం చుట్టూ విద్యుత్తు కంచెను ఏర్పాటు చేసుకున్నారు. తన ఆవులు మేపడానికి బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కంచె కాలికి తగలడంతో వసంతరావు మరణించాడు. ఈ విషయం తెలుసుకుని అతని బంధువులు అశ్వత్‌రావుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాధితుడు గురువారం రాత్రి మరణించాడని జిల్లా ఎస్పీ జి.కె.మిథున్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ ఘటనలో రెండు కుటుంబాల సభ్యుల నుంచి ఫిర్యాదులు అందాయి. పొలాలకు విద్యుత్తు కంచెలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని బెస్కాంకు సిఫార్సు చేశామని మిథున్‌కుమార్‌ తెలిపారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని