logo
Published : 27/11/2021 01:11 IST

రోడ్డెక్కిన అన్నదాత

రైతుల ఆందోళనతో చిత్రదుర్గ నగర శివార్లలో స్తంభించిన వాహనాలు

మైసూరు, న్యూస్‌టుడే : వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండుతో చేపట్టిన ఆందోళనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ప్రధాన రహదారులపై బంద్‌’ పిలుపు నేపథ్యంలో శుక్రవారం బెంగళూరు- మైసూరు, నంజనగూడు- మైసూరు మార్గాల్లో రైతులు బైఠాయించారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ సమీపంలోని కిరంగూరు కూడలిలో వందలాది మంది రైతులు బెంగళూరు- మైసూరు రహదారిపై కూర్చుని వాహన సంచారాన్ని అడ్డుకున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, రాష్ట్ర చెరకు రైతుల సంఘం, కర్ణాటక రైతు సంఘం, హసిరుసేనె తదితర సంఘాలకు చెందిన సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. మైసూరు వర్తుల రహదారిపై రైతు సంఘం అధ్యక్షుడు కురబూరు శాంతకుమార్‌ ధర్నా చేశారు. నూతన వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల శాంతకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కొనసాగించాలని డిమాండు చేశారు. శ్రీరంగపట్టణ శివార్లలోని బాబూరాయనకొప్పలు వద్ద రైతులు రహదారిపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో వాహన సంచారం పూర్తిగా నిలిచిపోయింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాల్ని మళ్లించారు. మైసూరు- బెంగళూరు మార్గాంలో వాహనాల్ని మళవళ్లి, బన్నూరు మీదుగా మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీరంగపట్టణ సమీపంలోని కిరంగనూరు కూడలిలో ధర్నాలో రైతులు​​​​​​​

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని