
పుస్తకంలో సంతకం చేసి బాధ్యతలు చేపడుతున్న మహేశ్ జోషి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కన్నడ సాహిత్య పరిషత్ 26వ అధ్యక్షుడిగా డాక్టర్ మహేశ్ జోషి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి ఆయనకు ‘కర్ణాటక పరంపరె’ పుస్తకాన్ని ప్రదానం చేసి అభినందించారు. సంస్థ మాజీ అధ్యక్షుడు మనుబళిగార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రంగప్ప, సీనియరు సాహితీవేత్త దొడ్డరంగేగౌడ, సాహితీవేత్తలు, కొత్త సభ్యులు, వివిధ మఠాల ప్రతినిధులు నూతన అధ్యక్షుడిని అభినందించారు. బెంగళూరుతో సహా సరిహద్దు జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని జోషి ఇదే సందర్భంలో ప్రకటించారు.