logo
Published : 27/11/2021 01:11 IST

దేశ సమగ్రతకే పెద్దపీట

రాజ్యాంగ భూమికపై సీఎం

దావణగెరె : రాజ్యాంగ పీఠికను చదువుతున్న

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తదితరులు

దావణగెరె, న్యూస్‌టుడే : దేశ సమైక్యత, సమగ్రతల్లో రాజ్యాంగానికి మహత్తరమైన భూమిక అని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ భారత రాజ్యాంగ దినం సందర్భంగా అందులోని పీఠికను చదివి వినిపించారు. దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలీయంగా ఉండాలంటే ప్రజల్లో జాగృతి ఎంతైనా అవసరమని చెప్పారు. దేశాన్ని ఒకతాటిపై నడిపించడంలో రాజ్యాంగానికే సాధ్యమైందన్నారు. బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగమని అభివర్ణించారు. ఆధునిక భారతదేశ పితామహుడిగా అంబేడ్కర్‌ సేవల్ని కొనియాడారు. ప్రపంచంలో మానవీయ అంశాలున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది మనదేనని చెప్పారు. ఇతర దేశాల్లోని రాజ్యాంగాలు కేవలం న్యాయ, బాధ్యతల గురించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తాయని అయితే మన రాజ్యాంగం పూర్తిగా మానవీయ గుణాలున్నదని చెప్పారు. మనల్ని పాలించిన బ్రిటిషర్ల నుంచి అనేక అంశాల్ని మన రాజ్యాంగరచనలో పొందుపరచామని చెబుతుంటారు. వారికి లిఖితపూర్వకమైన రాజ్యాంగమే లేదని అన్నారు. కార్యక్రమంలో పట్టణాభివృద్ధి మంత్రి బైరతి బసవరాజ, లోక్‌సభ సభ్యుడు సిద్ధేశ్వర, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎం.పి.రేణుకాచార్య తదితరులు పాల్గొన్నారు.

సమానత మరీచికే

బెంగళూరు (శివాజీనగర): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ దళిత, కార్మిక సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 72 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ సమానత్వం రాలేదని ఆందోళనలో పాల్గొన్న రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాల్లో రాజ్యాంగానికి సంబంధించి వివరాలు ఉంటే, ప్రతి ఒక్కరిలోనూ వారి హక్కులను తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని వివిధ మఠాల ప్రతినిధులు పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రతితో అంబేడ్కర్‌ వేషధారి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభినందనలు అందుకున్నారు. వివేకానంద న్యాయ కళాశాలలో ప్రత్యేకంగా ప్రచురించిన రాజ్యాంగం పీఠికను విడుదల చేశారు. రాజ్యాంగంలోని అంశాలను న్యాయవాదులు, న్యాయకోవిదులు విద్యార్థులకు వివరించారు.

బెంగళూరు : వివిధ సంఘాల ప్రదర్శనలో కార్యకర్తలతో అంబేడ్కర్‌ వేషధారి​​​​​​​

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని