logo
Published : 28/11/2021 00:54 IST

ప్రహసనంగా పరిషత్‌ పోరు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికలంటే జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌లదే హవా. గెలుపోటములు ఈ మూడ పార్టీల మధ్య దోబూచులాడుతుంటాయి. క్రమంగా ఈ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన పోటీ తప్ప ఎన్నికల్లో పోరు అంతంతమాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రహసనాన్ని విశ్లేషిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. కాంగ్రెస్‌ ఐదేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ పట్టుమని రెండేళ్లు పాలనను కొనసాగించలేదు. ఇందుకు కారణం పార్టీల మధ్య అంతు చిక్కని సమన్వయం, పట్టువిడుపులే. ఈ విచిత్ర రాజకీయ చిత్రం తాజా పరిషత్తు ఎన్నికల్లోనూ కనిపిస్తోంది.

తాజా పరిషత్తు ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య బయటకు కనిపించని సమన్వయం కనిపిస్తోంది. ఈ విషయంలో జేడీఎస్‌ తన వైఖరిని స్పష్టం చేసినా జాతీయ పార్టీలు లోలోపల మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ద్విక్షేత్ర స్థానాల్లో జాతీయ పార్టీల తీరుతెన్నులు గమనిస్తే ఎన్నికల్లో సహజ సిద్ధంగా కనిపించే పోటీతత్వం కనుమరుగైనట్లే తెలుస్తోంది. రెండు పార్టీలకు 25 అభ్యర్థులను బరిలో దింపే అవకాశాలున్నా 20మందితోనే పోరు ప్రారంభించాయి. ఉడుపి-దక్షిణ కన్నడ, ధార్వాడ- గదగ- హావేరి, మైసూరు- చామరాజ నగర, బాగల్‌కోటె-విజయపుర, బాగల్‌కోటె ద్విక్షేత్ర స్థానాల్లో ఇద్దరికి బదులుగా ఒక్కొక్కరికే అవకాశం కల్పించాయి. ఈ ఎత్తుగడ రెండు పార్టీల గెలుపు నల్లేరుపై నడకగానే సాగుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.సి.నాణెయ్య అభిప్రాయపడుతున్నారు. ఈ చోట్ల రెండు పార్టీలకు విజయావకాశాలు దాదాపు వందశాతం ఉంటాయంటున్నారు. జేడీఎస్‌ రాజకీయ పోకడ కారణంగా పోటీ చేయని 18చోట్ల భాజపాకు మేలు చేకూరనుంది. ఈ పార్టీ కూడా మైసూరు- చామరాజనగరలో ఒక్కరితోనే పోటీ చేస్తోంది. పోటీ చేసే ఏడు స్థానాల్లోనూ చిక్కబళ్లాపుర, తుమకూరు, బెంగళూరు గ్రామీణ వంటి ప్రాంతాల్లోనూ జేడీఎస్‌ ఓట్లు భాజపా కంటే కాంగ్రెస్‌ వైపే మళ్లే అవకాశం ఉందని నాణెయ్య విశ్లేషించారు. జాతీయ పార్టీల మధ్య ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వెన్నెముకలాంటి ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని నాణెయ్య ఆరోపించారు. పార్టీల సిద్ధాంతాలను చూసే ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తారు. గతంలో పార్టీల మధ్య పొత్తులు వారు ప్రకటిస్తే తప్ప బహిర్గతం అయ్యేవి కావు. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో పార్టీలు ప్రకటించే అభ్యర్థులు, పోటీ చేసే స్థానాల బట్టి పొత్తుల ప్రక్రియ సులువుగా ఓటర్లు పసిగట్టగలుగుతున్నారని వివరించారు. ఇది ఎన్నికల వ్యవస్థకు విఘాతం కల్గించే పరిణామంగా ఆయన అభివర్ణించారు. విధానపరిషత్తు ఎన్నికల్లో ఓటర్లు పార్టీలను చూసి కాకుండా అభ్యర్థుల పనితీరుకే ప్రాధాన్యమిస్తారు. పార్టీల చిహ్నం లేకుండా గెలిచిన పంచాయతీ సభ్యులు ఎన్నుకునే అభ్యర్థులను పార్టీలకు అంటగట్టడం సరికాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

విధానపరిషత్‌లో బలాబలాలు

మొత్తం స్థానాలు : 75

మ్యాజిక్‌ నంబరు : 38

భాజపా : 26

కాంగ్రెస్‌ : 15

జనతాదళ్‌ : 08

ప్రస్తుత ఎన్నికలు : 25

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని