logo
Published : 28/11/2021 00:54 IST

దళ్‌ మద్దతుపై ఆశల మోసులు

శివమొగ్గలో పరిషత్‌ ఎన్నికల ప్రచార సభను లాంఛనంగా ప్రారంభిస్తున్న యడియూరప్ప

శివమొగ్గ, న్యూస్‌టుడే : విధానపరిషత్‌ ఎన్నికల్లో జనతాదళ్‌ మధ్దతు భాజపాకు లభిస్తుందన్న ఆశాభావాన్ని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యక్తం చేశారు. సొంత జిల్లా.. శివమొగ్గ పర్యటనలో ఉన్న ఆయన శనివారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. మద్దతుపై ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించనున్నారని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయలేదో ఆ నియోజకవర్గంలో తమకు మద్దతునివ్వాలని తాను స్వయంగా విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విధానపరిషత్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులు కనీసం 15 స్థానాల్లో విజయం సాధిస్తారని ప్రకటించారు. శివమొగ్గలో ప్రచారాన్ని నిర్వహించి అనంతరం తీర్థహళ్లి, సాగర, సొరబలో ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. సోమవారం దావణగెరె జిల్లా హొన్నాళిలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని