logo
Published : 28/11/2021 00:54 IST

‘ఒకే గూటికి దళిత సంఘాలు’

సమావేశంలో మాట్లాడుతున్న గురుమూర్తి, చిత్రంలో సంఘం సభ్యులు

బళ్లారి, న్యూస్‌టుడే: కర్ణాటక దళిత సంఘర్ష సమితి (ప్రొ.బి.కృష్ణప్ప) పేరును మరో సంఘం పెట్టుకోవడం, రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా ఉపయోగించడం చట్టరీత్యా నేరమంటూ న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కర్ణాటక దళిత సంఘర్ణ సమితి రాష్ట్ర సంచాలకుడు గురుమూర్తి తెలిపారు. శనివారం బళ్లారిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కర్ణాటక దళిత సంఘర్ష సమితి పేరిట పలువురు సంఘాలను ఏర్పాటు చేశారు. దీనిపై న్యాయస్థానం కృష్ణప్ప (1974-75) స్థాపించిన కర్ణాటక దళిత సంఘర్ష సమితికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో ఇంతవరకు వేర్వేరుగా ఉన్న ఇతర సమితులు ఈ సంఘం గూటికి చేరాయన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కులపై పోరాటం చేస్తామన్నారు. కర్ణాటక దళిత సంఘర్ష సమితిలో ఉన్న సభ్యులకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండకూడదు. రాజకీయాల్లో తలపడాలనుకునేవారు తమ సంఘం నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు. దళిత రిజర్వేషన్‌ వర్గీకరణపై గతంలో భద్రావతిలోని కృష్ణప్ప సమాధి నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశాం. సదాశివ నివేదికను ఆమోదించాలని ఇకపైనా పోరాటం చేస్తామన్నారు. దళిత సముదాయానికి చెందిన ముండరిగ నాగరాజు బళ్లారి విధానపరిషత్‌ స్థానం నుంచి పోటీచేయడానికి ప్రయత్నించారు. కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే దళిత నేత తరఫున కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కె.సి.కొండయ్యకు మద్దతు ఇవ్వడాన్ని తమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 2022 ఫిబ్రవరి 15, 16లలో దావణగెరెలో కర్ణాటక దళిత సంఘర్ష సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించి సభ్యులను ఎంపిక చేయనున్నట్లు గురుమూర్తి తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం సభ్యులు గంగాధరప్ప, సోమశేఖర్‌, హనుమంతప్ప, సిద్దేష్‌, శివబసప్ప, సోమన్నహళ్లి, గోవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని