logo
Published : 02/12/2021 01:42 IST

ప్రోత్సాహధనం చెల్లించరేం?


ఏడీసీ మంజునాథకు వినతిపత్రం అందజేస్తున్న వైద్యవిద్యార్థి సంఘం ప్రతినిధులు

బళ్లారి, న్యూస్‌టుడే: కొవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా రోగులకు చికిత్స చేసిన తమకు ప్రకటించిన ప్రోత్సాహధనం చెల్లించాలని మూడో రోజు బుధవారం పీజీ వైద్య విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కర్ణాటక రెసిడెంట్‌ వైద్యుల సంఘం (కె.ఎ.ఆర్‌.డి.) విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించింది. మంగళవారం రాత్రి చలిని కూడా లెక్క చేయకుండా విమ్స్‌ సంచాలకుడి భవనం ముందు వినూత్న రీతిలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. బుధవారం విమ్స్‌ నుంచి జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అదనపు జిల్లా పాలనాధికారి మంజునాథకు వినతిపత్రం అందజేశారు. నెలకు రూ.10 వేల ప్రోత్సాహధనం ఇస్తామని వైద్య విద్యాశాఖ మంత్రి ప్రకటించినా నేటి వరకు అందలేదన్నారు. పీజీ వైద్య కోర్సుల రుసుములను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేయడంతో విమ్స్‌కు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆందోళనలో సంఘం ప్రతినిధులు అభిషేక్‌, సహానా, సేదేంద్ర, రోషక్‌, తేజా, ప్రకాష్‌, పూజ, తేజస్విని, సీతల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని