ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలన అధికారి డా.రామ్ప్రశాత్ మనోహర్
సిరుగుప్ప: విధాన పరిషత్ ఎన్నికల నిబంధనలు పూర్తిగా పాటించాలని సిరుగుప్ప తహసీల్దార్ ఎన్.ఆర్.మంజునాథ స్వామి ఉద్యోగులకు సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో బుధవారం పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నోడల్ అధికారులు శివప్ప సుభేదార్, డా.బసవరాజ్, పంపాపతి గౌడ పలు సూచనలు చేశారు.
హొసపేటె: ఎన్నికలను విజయవంతం చేసే బాధ్యత సిబ్బందిపై ఉందని తహసీల్దార్ హెచ్.విశ్వనాథ్ అన్నారు. బుధవారం హొసపేటెలో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లోని అధికారులు, సహాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అప్రమత్తంగా ఉండాలి. అన్ని కేంద్రాల్లో ఇప్పటికే సౌకర్యాలపై తాలూకా యంత్రాంగం పరిశీలన చేపట్టిందన్నారు. 9న మధ్యాహ్నానికల్లా ఎన్నికల సిబ్బంది తమ కేంద్రాలకు చేరుకోవాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకూ కేంద్రం విడిచి వెళ్లకూడదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. నిపుణులు డాక్టర్ సమ్మద్ కొట్టూరు, సోమశేఖర్ బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాఖలాల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.