logo
Published : 02/12/2021 01:42 IST

ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి


గుంజళ్లిలో నూర్పిడి చేసిన గింజలను చూస్తున్న ఎమ్మెల్యే ఆర్‌.బసనగౌడ

సింధనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం రాయచూరు జిల్లా రైతులపై కనికరం చూపాలని మస్కి ఎమ్మెల్యే ఆర్‌.బసనగౌడ డిమాండ్‌ చేశారు. వర్షాలకు పూర్తిగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు విధించకుండా కొనుగోలు చేయాలన్నారు. ఆయన బుధవారం సింధనూరు తాలూకా గుంజళ్లి గ్రామంలో పర్యటించారు. రైతులు నూర్పిడి చేస్తున్న ధాన్యం రాసుల వద్దకెళ్లి గింజలను చూశారు. ఈ ఏడాది కూడా సరిగ్గా నూర్పిడి సమయంలోనే అకాల వర్షాలు రైతును దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది నష్టం పూడ్చలేనిదిగా మారిందన్నారు. తడిసిన గింజలను ప్రైవేటు వర్తకులు తిరస్కరించడమో లేదా ధర తగ్గించడమో చేస్తారు. ప్రభుత్వమే సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేయిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఆర్‌.బసనగౌడ అన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని