logo
Published : 02/12/2021 01:42 IST

బళ్లారిలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేయండి


హుబ్బళ్లిలో రైల్వే సమస్యలపై చర్చిస్తున్న గుత్త చంద్రశేఖర్‌

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: బళ్లారి రైల్వేస్టేషన్‌లో కదిలే మెట్లు (ఎస్కలేటర్‌) సౌకర్యం కల్పిస్తూ, ఇతర సమస్యలు పరిష్కరించాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు గుత్త చంద్రశేఖర్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుబ్బళ్లిలో మంగళవారం దక్షిణ, పశ్చిమ రైల్వే విభాగం సలహాసమితి సమావేశంలో బళ్లారి సభ్యుడిగా పాల్గొని స్టేషన్‌లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బళ్లారి స్టేషన్‌లో రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లడానికి లిప్ట్‌, ఎస్కలేటర్‌ సదుపాయం కల్పించాలని కోరగా, ఇప్పటికే సివిల్‌, ఎలెక్ట్రికల్‌ పనులకు టెండర్‌ పిలిచాం. పనులు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారన్నారు. మోతీ కూడలిలోని రైల్వే వంతెన విస్తరణ పనులు, ప్రాంగణ స్వచ్ఛత, భద్రత తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చంద్రశేఖర్‌ తెలిపారు. రైలు ప్రయాణికుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చంద్రశేఖర్‌ను వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.శ్రీనివాసరావు, కార్యదర్శి యశ్వంత్‌రాజ్‌, సభ్యులు అభినందించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని