logo
Published : 02/12/2021 01:42 IST

సంగనబసవ స్వామీజీ మృతి తీరని లోటు


డాక్టర్‌ సంగనబసవ స్వామీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె కొట్టూరు స్వామి మఠం డాక్టర్‌ సంగనబసవ స్వామీజీ మృతితో ధార్మిక క్షేత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. రాష్ట్రంలోని మఠాధీశులందరికీ మార్గదర్శకులుగా నిలిచిన కొట్టూరు స్వామీజీ లేనిలోటు భర్తీ చేయడం కష్టమని బళ్లారి జిల్లా బాధ్యమంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగనబసవ స్వామీజీ పుణ్యస్మరణోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్య, ప్రసాదం, ఆధ్యాత్మిక బోధనలో పేరుగాంచిన సంగనబసవ స్వామీజీ ఉచితంగా పాఠశాల, వసతి నిలయాలు నడిపేవారని గుర్తు చేశారు. విద్యారంగం అభివృద్ధికి ఈ ప్రాంతంలో స్వామీజీ ఇతోధిక సేవలందించారని వివరించారు. వీరశైవ లింగాయత వర్గంవారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు స్వామీజీ ఎన్నో ప్రయత్నాలు చేశారని అన్నారు. సుమారు 60 ఏళ్ల నుంచి ఉచిత సామూహిక వివాహాలు చేయించారు. మఠంలో నిరంతరం ధార్మిక కార్యక్రమాలు జరిగేవని గుర్తుచేశారు. ఆ సంప్రదాయాన్ని ఉత్తరాధికారులు కొనసాగించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వళబళ్లారి సిద్ధలింగ మహాస్వామీజీ, సంతెకెల్లూరు గురుబసవ స్వామీజీ, భాజపా జిల్లా అధ్యక్షుడు చెన్నబసవనగౌడ పాటిల్‌, వీరశైవ సమాజం తాలూకా అధ్యక్షుడు శరణుస్వామీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని