logo
Published : 02/12/2021 01:42 IST

తక్షణ పరిహారానికి డిమాండ్‌


జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద రైతు సంఘం సభ్యుల ఆందోళన

బళ్లారి, న్యూస్‌టుడే: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని కోరుతూ సంయుక్త రైతు పోరాట సమితి, రైతు కృషి కార్మిక సంఘటన సంయుక్తంగా బుధవారం జిల్లా పాలనాధికారి కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించాయి. రైతు సంఘం సభ్యులు దేవదాస్‌, గోవింద, బసణ్ణ, ఖాసీంసాబ్‌, పంపాపతి, లక్ష్మీపతి, వెంకటేశ్‌, బళిబాయప్ప, కల్లుకంబ పంపాపతి, మారెప్ప, రైతులు స్థానిక గడిగి చెన్నప్ప కూడలి నుంచి జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. బళ్లారి జిల్లాలో మిరప 1.05 లక్షల ఎకరాలు, వరి, ఇతర పంటలు సుమారు 20 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మిరప రైతులకు ఎకరానికి రూ.50 వేలు, పత్తికి రూ.30 వేలు, వరికి రూ.20 వేలు పరిహారం ఇవ్వాలి. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి. వర్షంతో తడిసి నాణ్యత తగ్గిన బ్యాడగి మిరపకు క్వింటాలుకు రూ.30 వేలు, గుంటూరు మిరపకు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పలువురు రైతులు పాల్గొని జిల్లా పాలనాధికారి కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి పంపాలని కోరారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని