logo
Published : 02/12/2021 01:42 IST

సింధనూరులో తాగునీటి కటకట


తెగిపోయిన గట్టును పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాదర్లి, అధికారులు, కౌన్సిలర్లు

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని జలాశయం (సమ్మర్‌ స్టోరేజ్‌) ఉత్తరదిక్కు గట్టుకు మరోసారి గండి పడింది. ఆదివారం మూడోసారి గండిపడడంతో నిల్వ నీరు బయటకు పోయింది. గట్టు దాదాపు 150 మీటర్ల పొడవున దెబ్బతింది. దీంతో దీనిని పూర్తి సామర్థ్యంతో నింపే వీలు లేకుండా పోయింది. ఆదివారం నగరసభ అధికారులు విషయాన్ని జిల్లా పాలనాధికారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకుని రాయచూరు నుంచి జలమండలి ఉన్నతాధికారులు సింధనూరు వచ్చి పరిశీలించారు. మరమ్మతులకు రూ.కోటి వరకూ ఖర్చు కావచ్చని, పనులు నెల వరకూ పట్టవచ్చని అంచనా వేశారు. మంగళవారం మరోసారి కమిషనర్‌ విరుపాక్షమూర్తి, ఇతర అధికారులు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే బాదర్లి కూడా కౌన్సిలర్లతో కలసి దెబ్బతిన్న గట్టు ప్రాంతాన్ని చూశారు. త్వరితగతిన పనులు చేపట్టాలని అధికారులను కోరారు. నగరసభ అధ్యక్షుడు మల్లీగౌడ కుళాయిలకు నీటి సరఫరాను వారం రోజులకోసారి సరఫరా చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆరు రోజులకోసారి తాగునీటిని వదులుతున్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని